నటి సమంత రిటైర్మెంట్ తీసుకుంటుందా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకుముందు రెండుసార్లు నటిగా ఇంకా రెండు, మూడు సంవత్సరాలే అన్నారు. ఈ విషయమై బుధవారంనాడు ఆమెను ప్రశ్నిస్తే... రిటైర్మెంట్ అని కాదు కానీ చాలా పాత్రలు చేశాను. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ కావాలి. అని వెల్లడించారు. ఫ్యామిలీ పిల్లలు వంటి విషయాల్లో ఆసక్తి చూపుతున్నట్లు ఆమె మాటల్లో అర్థమవుతోంది. ఆమె నటించిన 'జాను' చిత్రం ఈనెల7న విడుదలకాబోతుంది.
ఇక చైతన్య సపోర్ట్ గురించి చెబుతూ.. చైతన్య నాకు పది సంవత్సరాలుగా తెలుసు. మేము ఇద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ అన్ని విషయాలలో సపోర్టింగ్ గా ఉంటాం. '96' రీమేక్ చేస్తున్నారన్నప్పుడు మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఇద్దరం కలిసే ఈ సినిమా చూశాం. అప్పుడే ఈ సినిమాను రీమేక్ చేయకూడదు అనుకున్నాం. కానీ ఇప్పుడు టీజర్. ట్రైలర్ చూసి మా అభిప్రాయం కొంత మారింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా నమ్ముతారు. ఆ మ్యాజిక్ మళ్ళీ రీ క్రియేట్ అయింది. ప్రతి సినిమా తర్వాత నా కెరీర్ అయిపోయిందని భావిస్తుంటాను. రిలీజ్ అప్పుడు కూడా చాలా టెన్షన్ పడ్డాను. సినిమా టాక్ వచ్చిన తర్వాత నేను డిస్ కనెక్ట్ అయిపోతాను.
హీరోయిన్గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో నటించాను. దాంట్లో కొత్త సమంతను చూస్తారు. బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా కష్టపడ్డాను. యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాను. అది చేసేటప్పుడు హీరోలు ఇంత కష్టపడి ఫైట్స్ చేస్తున్నారా? అనిపించింది. ఒక సీన్లో కూడా డూప్‌ను పెట్టుకోలేదు. నేనే స్వయంగా చేశాను. క్రమాగా అనే ఫైట్ మాస్టర్ దగ్గర యాక్షన్ సన్నివేశాలను శిక్షణ తీసుకున్నాను. ఇక వెబ్‌సిరీస్‌లో ఇప్పటి వరకు చేయని యాక్షన్, నెగటివ్ రోల్లో నన్ను చూస్తారని తెలిపింది.
మరింత సమాచారం తెలుసుకోండి: