నేను బతికే ఉన్నాను.. 'చంపేయకండి'.. నటి ఆవేదన

Murali

ప్రముఖ హిందీ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకుంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ అనే సీరియల్‌లో నటించిన సెజల్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ షాక్ కు గురైంది. సెజల్ ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. అయితే.. సెజల్ శర్మ పేరుతో మరో టీవీ నటి కూడా ఉంది. చనిపోయింది ఈమె అనుకుని ఈమె ఫోటోలు వాడేస్తూ సోషల్ మీడియా సంతాపాలు వెల్లువెత్తాయి.

 

 

దీంతో ఖంగుతున్న సెజల్ శర్మ వెంటనే స్పందించింది. పలు వెబ్‌సైట్లలో తన ఫొటో రావడంతో సెజల్ తో పాటు ఆమె బంధువులు, స్నేహితులు షాక్ కు గురై ఇంటికి ఫోన్లు చేస్తున్నారట. దాంతో వెంటనే సెజల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘హల్లో.. నా స్నేహితులు, ఫ్యా్న్స్‌కి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. సెజల్ శర్మ అనే మరో నటి ఆత్మహత్య చేసుకుంది. దీనికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆత్మహత్యే మార్గం కాకూడదు. సూసైడ్ అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం చూపదు. పలు మీడియా సంస్థలు కన్ఫ్యూజ్ అయి పొరపాటున నా ఫొటోలు ఉపయోగిస్తున్నాయి. నా బంధువులు, సన్నిహితులు షాక్‌కు గురవుతుండడంతో నేను క్లారిటీ ఇస్తున్నాను’ అని తెలిపింది.

 

 

సెజల్ ఆత్మహత్యకు ఎటువంటి ఒత్తిడి కారణం కాదనీ.. ప్రేమ సంబంధమైన సమస్యలు కూడా ఏమీ లేవని ఆమె తల్లి చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెజల్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకరికి బదులు మరొకరు బలి కావడం.. ఒకే పేరుతో ఉన్న క్యారెక్టర్లు.. సినిమాల్లోనే ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ నిజజీవితంలో కూడా ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Hello... I want to convey to all my friends and fans that I am absolutely fine. I am shocked and saddened by the suicide of actress Sejal Sharma. I plead to everybody, if you are depressed or disheartened in life, please don't end your life. Suicide is never a solution. I am appalled by the {{RelevantDataTitle}}