ఆ విషయంలో మా అమ్మ సలహాలు తీసుకున్నాను : పాయల్ రాజ్ పుత్

praveen

ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి ఒక న్యూడ్ పాత్రలో నటించి ఎంతో స్టార్ డమ్ సంపాదించింది. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ కొంచెంకొంచెంగా ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరవుతుంది. మొన్నటికి మొన్న వెంకటేష్ తో జోడీ కట్టి వెంకీ మామ సినిమాలో నటించిన పాయల్ రాజ్ కామెడీ ఆడియెన్స్ కు మరింత దగ్గర అయిపోయింది. ఇక ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన విఐ  ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా నటించింది ఈ అమ్మడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకు పోతుంది. ఈ సందర్భంగా ఓయ్ ఇంటర్వ్యూకు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. 

 

 

 2020 సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైందని... డిస్కో రాజా సినిమాలో తన పాత్ర బాగుందని ఎంతోమంది అందరు  అభినందిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర నిడివి తక్కువ గానే ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం బాగుంది అంటూ చెప్పింది. డిస్కో రాజా సినిమాలో మూగ చెవిటి అమ్మాయి గా నటించానని తెలిపిన పాయల్ రాజ్ పుత్... ఈ పాత్ర చేయడం... మాటల్లో కాకుండా తన చేతుల్లో అన్ని అర్థమయ్యేలా చెప్పడం చాలెంజింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక కథ పరంగా సినిమాలో తన పాత్రకు రెట్రో  లుక్  ఉంటుందని ఆ పాత్రలో తగినట్టుగా తయారవడం కోసం మా అమ్మ దగ్గర ఎన్నో సలహాలు తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 

 

 

 నాకు ఎంతో పేరును డబ్బులు ఇచ్చిన ఇండస్ట్రీ పైన ఎనలేని అభిమానం ఉందని... తెలిపిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ ఈ సినిమాతో ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను  అంటూ చెప్పుకొచ్చారు. కథల ఎంపికలో కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానంటూ  తెలిపింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమా నా కెరీర్లోనే స్పెషల్ సినిమా అని... ఆ సినిమానే నాకు ఇంతటి గుర్తింపు తెచ్చింది అంటూ తెలిపింది పాయల్ రాజ్ పుత్. కొంచెం కొంచెంగా విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది పాయల్ పాప.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: