సినీ రాజకీయం :  స‌రిలేరు వ‌ర్సెస్ అల‌: మ‌హేశ్‌కి బ‌న్నీ ఫ‌స్ట్ పంచ్ ప‌డిందిలా...?

KSK

 

 

తెలుగోడికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలంగాణలో ఈ పండుగ జోరు కాస్త తక్కువైనా ఆంధ్రాలో మాత్రం పండుగ అంటే సంక్రాంతే. అందుకే పొట్టకూటి కోసం దేశంలోని, ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా.. సంక్రాంతి నాటికి జన్మభూమికి క్యూ కడతారు ఆంధ్రులు. ఆ పండుగ మూడు రోజులు తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి.

 

 

ఏడాదంతా బోసి పోయినా.. పల్లెటూళ్లకు సంక్రాంతి కళ వస్తుంది. ఓవర్సీస్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీమియర్స్ తో డదడలాడిస్తే.. ఈరోజు విడుదలైన అల వైకుంఠపురములో అటు అమెరికా ఇటు న్యూజిలాండ్ లో రచ్చ రంబోలా అన్న రేంజ్ లో దూసుకుపోయింది … అమెరికాలో అల వైకుంఠపురంలో ప్రీమియర్‌కి 590,216 డాలర్ల వసూళ్లు వచ్చినట్లు, అదే మహేష్ సరిలేరు నీకెవ్వరూ అమెరికాలో తొలిరోజు కలెక్షన్లు 417,559 డాలర్లు వసూళ్లు వచ్చినట్టుగా తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్విట్టర్ వేదికగా తెలియయజేసాడు.

 

 

మరి ఆ రకంగా మహేష్ సరిలేరు కన్నా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఓ రేంజ్ లో దూసుకుపోయిందనే చెప్పాలి. ఈ సినిమా కి ప్రధానం గా త్రివిక్రమ్ ఉండడం తో ఈ చిత్రం  అమెరికాలోనే కాదు… న్యూజిలాండ్ లోను అల వైకుంఠపురములో రచ్చ మాములుగా లేదని చెబుతున్నారు ట్రేడ్ పండితులు .  మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది అని చెబుతున్నారు.  బ్లాక్ బస్టర్ రిపోర్ట్ లతో అల వైకుంఠపురములో ప్రతీ అంశం లో మహేశ్ బాబు సినిమా ని సక్సెస్ఫుల్ గా డామినేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ కావడం తో ఈ సినిమాలు థియేటర్ లలో ఎంతవరకూ నిలబడతాయి అనేది రెండవ వీకెండ్ దాటితే కానీ చెప్పలేని పరిస్తితి. ఈలోగా మాత్రం రఫ్ ఆడేస్తాయి .

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: