షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో..!
ఈ మద్య కొంత మంది సినిమా హీరోలు రియలిస్టిగ్ గా ఉండేందుకు ఎంతో తాపత్రపడుతున్నారు. తాము చేస్తున్న పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం ఆ పాత్రలో ఎలా ఉండాలో ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. ఆ మద్య గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీ జెర్సీ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటరైనర్ గా నిలిచింది. నాని కెరీర్ లో బెస్ట్ మూవీగా జెర్సీ నిలిచిపోయేంతగా ఆయన నటన కనబరిచారు. పెళ్ళైన స్ట్రగులింగ్ క్రికెటర్ గా నాని చాలా బాగా నటించారు. అయితే ఓ క్రికెటర్ గా ఎలా ఉండాలన్న విషయాన్ని ఆయన కొన్ని రోజుల ముందు మైదానంలో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో నాని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట.. కొన్ని గాయాలు కూడా అయ్యాయట.. కానీ వెండితెరపై ఓ క్రికెటర్ మైదానంలో ఎలా ఉండాలో తన నటనతో అదరగొట్టాడు. తాజాగా జెర్సీ హిందీ వెర్షన్‌కు గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్, అమన్ గిల్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. నాని లాగానే షాహిద్ కపూర్ కూడా క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ లో మునిగిపోయారట. ఆ సమయంలో బంతి ఊహించని విధంగా వచ్చి షాహిద్ ముఖానికి తగిలి దిగువ పెదవిపై తీవ్రం గాయమైంది.
షాహిద్ కపూర్ పెదవి చిట్లి రక్తం రావడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పెదవులు బాగా చిట్లిపోవడం వల్ల వాపు రావడం జరిగిందట. డాక్టర్లు అతడి పెదవికి కుట్లు వేశారు. పెదవిపై అయిన గాయం నయం కావడానికి సమయం పడుతుందని. కనీసం ఓ వారం రోజులైన పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని షాహిత్ కపూర్ కి డాక్లర్లు సూచించినట్లు సమాచారం. దాంతో సినిమా షూటింగ్ ని కొన్ని రోజులు పాటు నిలిపివేశారు. ఆ తరువాత నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు.