రానా తో రాజ్ తరుణ్ ..కాపాడటం కోసమేనా ..?

Kunchala Govind

డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ టాలీవుడ్ లో ఉయ్యాలా జంపాలా సినిమాతో పరిచయమై ఒక్కసారిగా యంగ్ స్టార్ గా ఎదిగాడు. కుమారి 21 ఎఫ్ తో ఇక తిరుగులేదనుకున్నాడు పాపం. అయితే ఎంత త్వరగా హీరోగా ఎదిగాడో అంతే త్వరగా కిందకి జారిపడ్డాడు. ఇందుకు కారణం తనే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక గత రెండు సంవత్సరాలుగా వరుస పరాజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఒక్క అంధగాడు తప్ప మిగతా ఐదు సినిమాల్లో ఏ ఒక్కటి ఈ కుర్ర హీరో అనుకున్న రేంజ్ లో సక్సస్ ని అందుకోలేకపోయాడు.ఇక రీసెంట్‌గా ఇద్దరి లోకం ఒకటే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో వచ్చిన అవకాశాల్ని కూడా వదులుకోవడానికి సిద్దపడ్డాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో డ్రీమ్ గర్ల్ సినిమా లో నటించాల్సి ఉండగా..అనుకోకుండా ఆ ప్రాజెక్ట్  నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ నగర్ లో ఒక న్యూస్ వైరల్ అయింది. మొత్తానికి డ్రీమ్ గర్ల్ స్క్రిప్ట్  పనులు సిద్దం చేసుకుని సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోన్న సమయంలో రాజ్ తరుణ్ ఈ ట్విస్ట్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

 

ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ యంగ్ హీరోకి మల్టీస్టారర్ లో నటించే మంచి అవకాశాన్ని కల్పించారట. రానా హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'సోనూ కి టిటులీకి స్వీటీ' మూవీ రీ మేక్ గా  నిర్మించడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ గా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో రానా తో కలిసి ఈ సినిమాలో నటించే అరుదైన మంచి అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ డల్ అయిన కారణంగా రానాతో కలసి నటిస్తే మళ్లీ ఒక హిట్ పడే అవకాశం లేకపోలేదు.

 

రాజ్ తరుణ్ యంగ్ ట్యాలెంటెడ్ హిరోల్లో ఒకడిగా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అవకాశం వచ్చిన ప్రతీచోట నిరూపించుకునే ప్రయత్నం చేసాడు.  మరి ఈ ఛాన్స్ ని యంగ్ హీరో సరిగ్గ ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి 'అలా ఎలా' సినిమాని తెరకెక్కించిన దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ తో రానా సినిమా చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. సొంత స్క్రిప్ట్ తో సురేష్ బాబుని మెప్పించలేపోయాడు. అయినప్పటికి బాలీవుడ్ స్క్రిప్ట్ ఆధారంగా అనీష్ కథను సిద్ధం చేసి పట్టాలెక్కించబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ  సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక రాజ్ తరుణ్ ని సురేష్ బాబే హీరోని చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: