రూల‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Arshu
నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే మనకు ఆయన డైలాగులు గుర్తుకొస్తాయి. ఆయన రౌద్రం మన కళ్ల ముందు కనిపిస్తది. తొడగొడుతూ మీసం మెలేసే ఆ అందమైన రూపం మన మదిలో మెదిలేది. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాల్లో ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు మన నోటితో చెప్పి ఆనందపడేవాళ్లం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియా వచ్చిన తరవాత బాలయ్య బాబు నటనను ప్రశంసించే వాళ్లకన్నా ఆయనపై సెటైర్లు వేసేవాళ్లు, ఆయన్ని విమర్శించేవాళ్లు ఎక్కువైపోయారు.


బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సింహా’ సినిమాతో బాలయ్య పడిలేచిన కెరటంలా కనిపించారు. నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం తీసుకొచ్చారు. ఆ తరవాత ‘లెజెండ్’ సినిమా కూడా బాలయ్య స్టామినా ఏంటో చూపించింది. ఈ రెండు సినిమాలతో బాలకృష్ణ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది. కానీ, ఆ తరవాత వచ్చిన సినిమాలేవీ అభిమానుల ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. కిందటేడాది కె.యస్.రవికుమార్‌తో చేసిన ‘జైసింహా’ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో ఇదే కాంబినేషన్‌లో వస్తోన్న ‘రూలర్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక నిన్న విడుద‌లైన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల పై ఓ లుక్ వేద్దాం...

ఏరియావైజ్ క‌లెక్ష‌న్లు...

నైజాం              0.68కోట్లు
సీడెడ్              1.08కోట్లు
నెల్లూరు           0.22కోట్లు
కృష్ణ                 0.19కోట్లు
గుంటూరు       1.20కోట్లు
వైజాగ్               0.27కోట్లు
తూర్పుగోదావ‌రి 0.26కోట్లు
ప‌శ్చిమ‌గోదావారి 0.21కోట్లు

మొత్తం తెలుగు రాష్ట్రాల షేర్  4.11కోట్లు  వ‌సూలు చేసింది. ఈ వయసులో కుర్రాళ్ళతో పోటీగా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడ‌ని. కుర్రాడిలా తగ్గి అందంగా తయారై ఆ ఫిజిక్ ఏంటి ఎలా సాధ్యం అని అందరూ ముక్కున వేలేసుకుని శభాష్ బాలయ్య అనేటట్టుగా ఆయ‌న  రూపం ఉంద‌ని ఫ్యాన్స్ ఆనంద‌ప‌డుతున్నారు. మీరు ఏం చేస్తున్నారండి.. మీ దగ్గరికి కథలు పట్టుకు వచ్చేవాడిని కత్తితో కండకండాలుగా నరికేయాలి. ఆ సెట్టింగులేంటి... అంత తొందరగా సినిమా ఎవరు తీయమన్నారు బాల బాబు. ఆ కాస్ట్యూమ్స్ ఏంటండి బాబు. కాస్త శ్రద్ధ తీసుకోండి. అని ఇలా ర‌క‌ర‌కాల ట్రోలింగులు జ‌రుగుతున్నాయి. ఇక ఈ క్రిస్‌మ‌స్ సెల‌వుల్లో అన్ని సినిమాల‌ను ప‌క్క‌కు నెట్టి బాల‌య్య పైకి వ‌స్తాడా లేడా అన్న‌ది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: