బాలయ్య మార్క్ మాస్ రొటీన్ మసాలా మాత్రమే రూలర్.?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్. నందమూరి బాలకృష్ణ 105వ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహా నాయకుడు కథానాయకుడు సినిమా లు బాలయ్య అభిమానులను నిరాశ పరచడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులు అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మరోసారి బాలయ్య మార్క్ కనిపించబోతున్నదని స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో కూడా బాలయ్య మారర్క్ కొట్టొచ్చినట్లు కనిపించింది ఇక ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అందరూ పూర్తిస్థాయిలో అవుట్ అండ్ మాస్ ఓరియెంటెడ్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో బాలయ్య చేసాడు అని చెబుతున్నారు.
సినిమాలు బాలయ్య రొటీన్ కథే రిపీట్ అయింది అని ప్రేక్షకులు భావిస్తారు. ముఖ్యంగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బి సి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక రూలర్ సినిమాలో ఒక్క గుద్దు తోనే కార్ డోర్ ఊడి రావడం.. విలన్లు గాల్లోకి ఎగిరి పోవటాలు జరిగాయి . తుఫాను వచ్చినప్పుడు చెత్త ఎగిరి పోయినట్లు విలన్లు బాలయ్య ఒక్క పంచుతూ ఎగురుతారు. ఇక బాలయ్య కారుతో గుద్దుతే వీళ్లందరూ చెల్లాచెదురుగా పడి పోయారు. ఇక బాలయ్య ఒక్కొక్కరినీ నరుకుతుంటే మినిస్టర్ భవానీప్రసాద్ అనుచరులు గాల్లోకి ఎగురుతూ ఉంటే ఓవైపు బాలయ్య కత్తికి రక్తం కారుతూనే ఉంది. మొత్తానికి బాలయ్య ఇంటర్వెల్ వీటన్నితో గడిపేశాడు.మాస్ ప్రేక్షకులందరికీ ఇంటర్వెల్ వరకు పూనకం తెప్పించాడు బాలయ్య.
ఇక రూలర్ సినిమా మొత్తం వన్ మాన్ షో గా ముందుకు సాగిపోతూ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా బాలయ్య ఎనర్జీ బాలయ్య చెప్పిన పంచ్ డైలాగులు బాలయ్య బాలయ్య డాన్స్ లు తప్ప ఇంకేమీ కనిపించదు సగటు ప్రేక్షకుడికి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు పూనకం తెచ్చి... దబిడి దిబిడి చేసేసాడు బాలయ్య. బాలయ్యకు ఐదు పదుల వయస్సు దాటి పోయినప్పటికీ ఇప్పటికీ... యువ హీరోలకు మించిన ఎనర్జీని చూపిస్తున్నాడు బాలయ్య. అందుకేనేమో మాస్ ప్రేక్షకులు బాలయ్యను అంతగా ఇష్టపడుతూ ఉంటారు. మొత్తానికి అయితే రూలర్ సినిమా మాస్ యాక్షన్తో రొటీన్ కథ తో కొంత మంది ప్రేక్షకులను ఆకర్షించింది అని చెప్పాలి.