అన్న‌పై తార‌క్ అపార ప్రేమ‌... క‌ళ్యాణ్‌రామ్‌ క‌ష్టాల గ‌ట్టెక్కేశాడు...!

KSK

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న సమయంలో వక్కంతం వంశీ ఇచ్చిన స్టోరీతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ అనే సినిమా చేసి చాలాకాలానికి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటినుండి వరుస సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ మంచి మంచి సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. అయితే తన కెరీర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న సమయంలోనే తన అన్న కళ్యాణ్ రామ్ కెరియర్ డౌన్ ఫాల్ లో ఉన్న నేపథ్యంలో… తన కెరీర్ గురించి కూడా ఆలోచిస్తూ అన్న కళ్యాణ్ రామ్ పెట్టిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేసి అత్యధికమైన లాభాలు తన అన్నకి వచ్చేలా కష్టాలు గట్టెక్కించేలా ఇద్దరి కెరీర్లు సక్సెస్ ట్రాక్ లో ఉండేటట్లు తారక్ అద్భుతంగా ఆలోచించి అన్నదమ్ముల కెరీర్లు సక్సెస్ లో ఉండేటట్లు చూశాడు.

 

కళ్యాణ్ రామ్ కెరియర్ ‘పటాస్’ ముందు వరకు గమనిస్తే వ‌రుస‌గా సినిమాలు ప్లాపులు.. భారీ న‌ష్టాలు.. ఇటువంటి సమయంలో ఆర్థికంగా కళ్యాణ్ రామ్ కెరియర్ చాల డౌన్ ఫాల్ ఉన్న సమయం లోనే తనకి మంచి సక్సెస్లు వచ్చినా సమయంలో అన్న బ్యానర్లో రెమ్యున‌రేష‌న్ లేకుండా ‘జై ల‌వ‌కుశ’ సినిమా చేసి భారీ లాభాల‌తో అన్న‌ను సేఫ్  చేసేసి,,. అన్న‌పై అపార ప్రేమ చాటుకున్నాడు. సినిమాకి మంచి టాక్ రావడంతో సూపర్ డూపర్ హిట్ కావడంతో భారీగా కలెక్షన్లు రికార్డు స్థాయిలో రావడంతో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా నిలదొక్కు పోయాడు అని చాలామంది ఇండస్ట్రీలో అంటుంటారు.

 

ఇదే తరుణంలో ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో ప్రస్తుతం నందమూరి అభిమానులను అలరించే విధంగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ స్టోరీ కలిగిన ఓ సినిమాని చేయాలనే ఆలోచనలో కళ్యాణ్ రామ్ స్టోరీ కోసం వెతుకుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: