మాస్ రాజా రవితేజ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం క్రాక్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందు రవితేజ పోలీస్ గా నటించిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దాంతో క్రాక్ పై కూడా మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం పాతబస్తీ లో జరుగుతుంది. అందులో భాగంగా నైట్ ఎఫెక్ట్ లో రామ్- లక్ష్మణ్ అద్వర్యం లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 25శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సముద్రఖని , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ చిత్రం కన్నా ముందు రవితేజ , డిస్కోరాజా తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 24న విడుదలకానుంది.
సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాభా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ , తాన్యా హాప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.