ఆది ఇంతకీ ఎవరికి ‘పార్ట్నర్` కాబోతున్నాడంటే...?
ఈ పుట్టినరోజు ఆది పినిశెట్టికి ఎంతో ప్రత్యేకం కానుంది. ఆది మూడు భిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ‘పార్టనర్' చిత్రంతో పాటు ఆయన పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తోన్న స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘క్లాప్'... నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమాలోని లుక్స్‌ను విడుదల చేశారు.
ఆది పినిశెట్టి, హన్సిక మొత్వాని, పల్లక్ లల్వాని, పాండిరాజన యోగిబాబు, జాన్ విజయ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: మనోజ్ దామోదరన్, నిర్మాత: రాయల్ ఫార్చున క్రియేషన్స్, సినిమాటోగ్రఫీ: షబీర్ అహమద్, సంగీతం: సంతోష్ దయానిధి, ఎడిటర్: గోపీ. ఆది పినిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఈ రోజు ఉదయం క్లాప్ అనే మరో చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. ఇక పార్ట్నర్ అనే చిత్రంలో కూడా ఆది నటిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.సైంటిఫిక్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక, పల్లక్ లాల్వానీ కథానాయికలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు మనోజ్ దామోదరం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది .