ప్రభుత్వానికి అదిరిపోయే టేక్స్ కట్టిన పవన్ అత్తారిల్లు...

frame ప్రభుత్వానికి అదిరిపోయే టేక్స్ కట్టిన పవన్ అత్తారిల్లు...

Seetha Sailaja
పవన్ ‘అత్తారిల్లు’ సినిమాను మొదలు పెట్టినప్పుడు ఇన్ని రికార్డులు తన సినిమా సృష్టిస్తుందని తనకు తానే కలలో కూడా అనుకుని ఉండడు. టాలీవుడ్ రికార్డులను తిరగ రాస్తూ 100 కోట్ల మైలురాయికి అతి చేరువలో ఉన్న పవన్ ‘అత్తారిల్లు’ సినిమా ప్రభుత్వానికి అదిరిపోయే ఆదాయాన్ని ఇచ్చి కూడా రికార్డులను సృష్టిస్తోంది.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా వల్ల ప్రభుత్వానికి 7 కోట్ల వరకు వినోదపు పన్నుగా ఈ సినిమా ద్వారా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంత అత్యధిక మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన సినిమాగా పవన్ ‘అత్తారిల్లు’ మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా సామాన్యంగా ఒక సూపర్ హిట్ సినిమా 50 రోజులలో వసూలు చేసే కలెక్షన్స్ కేవలం 25 రోజులలో వసూలు చేయడంతో ఈ అద్భుతం జరిగింది అని అంటున్నారు.  మరొక ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే సంక్రాంతికి బుల్లి తెరపై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రకటనలు దాదాపు 6 కోట్ల వరకు అప్పుడే బుక్ ఐపోయాయి అంటే పవన్ ‘అత్తారిల్లు’ మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More