ఈఏడాది సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు కలిసి రాలేదనే చెప్పాలి. కొత్త దర్శకుడు భరత్ కమ్మ తో అయన చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా తరువాత విజయ్ ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం ఇప్పటికి ఓ కొలిక్కి రాలేదు. అలాగే అప్పుడెప్పుడో టైటిల్ , ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు అంతే మళ్ళీ ఇంతవరకు ఈచిత్రం గురించి మరో అప్డేట్ వెలుబడలేదు. దాంతో ఈసినిమా కు పెద్దగా బజ్ లేదు. సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో వున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆపోటోల్లోని విజయ్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే ఆ లుక్ వరల్డ్ ఫేమస్ లవర్ కోసమా లేక విజయ్ తో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీయబోయే ఫైటర్ కోసమాని అభిమానులకు క్లారిటీ రావడం లేదు. ఇక వచ్చే నెల నుండి ఫైటర్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని సమాచారం. పూరి సినిమాల్లో హీరోల బాడీ లాంగ్వేజ్ డిఫ్రెంట్ గా ఉంటుంది. మరి ఈసినిమాలో విజయ్ ను పూరి ఏవిధంగా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.