పవన్ కళ్యాణ్ ను బాగానే వాడుకుంటున్నారే..!

NAGARJUNA NAKKA

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడా?  రాడా అనేది ఇప్పటికీ తేలట్లేదు కానీ.. పవర్ స్టార్ క్రేజ్ ని వాడుకునే వాళ్లు మాత్రం పెరిగిపోతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు పవన్ ఇమేజ్ తో బిజినెస్ చేసుకుంటున్నాయి. 

 

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గురించి ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. దర్శక నిర్మాతలు పవర్ స్టార్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ జనసేనాని మాత్రం ఓపెన్ అవ్వడం లేదు. అయితే పవర్ స్టార్ యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చినా.. ఇండస్ట్రీ జనాలు మాత్రం పవన్ ఇమేజ్ ని వదిలిపెట్టడం లేదు. ఈ హీరో క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పోటీ పడి మరీ పవర్ స్టార్ కి పాటలు అంకితమిస్తున్నారు. 

 

జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా జార్జిరెడ్డి. ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీలో విజయమనే పాట ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఈ సాంగ్ అంగితమంటూ పవన్ విజువల్స్ ని మిక్స్ చేశారు. ఆడియన్స్ లో బజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. 

 

ఉదయ్ శంకర్, ఐశ్వర్యరాయ్ రాజేశ్ లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా మిస్ మ్యాచ్. ఈ మూవీలో పవన్ హిట్ సాంగ్ ఈ మనసే.. పాటని రిమేడ్ చేశారు. తొలిప్రేమ నుంచి తీసుకున్న ఈ పాటను రీమిక్స్ చేసి పవన్ కళ్యాణ్ కు అంకితమిచ్చారు దర్శకనిర్మాతలు. అయితే పవన్ పై అభిమానముంటే మరో రకంగా చూపించుకోవచ్చుగానీ.. ఈ అంకితాలతో వ్యాపారం చేయడమేంటని విమర్శలు చేస్తూనే ఉన్నారు నెటిజన్లు. మొత్తానికి చిన్న సినిమాల దర్శక నిర్మాతలు.. పవన్ కళ్యాణ్ ను బాగానే వాడుకుంటున్నారు. జనాల్లో పవన్ కళ్యాణ్ కుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే కాసుల వర్షం కురిపిస్తుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ అంకితమనే అస్త్రాన్ని వాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: