అభిమానుల కోసం అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్..!
ఇటీవల దర్బార్ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్ డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంతవరకు ముగించేసి సినిమా టీజర్ ని విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. వచ్చే నెల 12న తలైవా 69వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా అదే రోజు దర్బార్ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే రాబోయే పుట్టినరోజు గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగా భారీ స్థాయిలో తనని చాలా బాగా అభిమానించే అభిమానుల సమక్షంలో రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి రెడీ అయినట్లు అదేరోజు సినిమా ట్రైలర్ ని కూడా అభిమానుల సమక్షంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అభిమానులకు తన పుట్టినరోజు అదిరిపోయే గిఫ్ట్ గా దర్బార్ సినిమా ట్రైలర్ విడుదల చేయాలని రజనీకాంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు టైలర్ కి సంబంధించిన పనుల విషయంలో బిజీ బిజీగా ఉన్నట్లు అనుకున్న టైం కి రజిని పుట్టినరోజు నాడు ఎలాగైనా విడుదల చేయాలని ప్రస్తుతం దర్బార్ సినిమా ట్రైలర్ విషయంలో సినిమా యూనిట్ చాలా జాగ్రత్తలు అభిమానులకు నచ్చే విధంగా తీసుకుంటున్నట్లు సమాచారం.