యంగ్ హీరో తో జపాన్ వెళ్ళిపోతున్న సమంత !!

Seetha Sailaja
ప్రస్తుతం సమంత గురించి వార్తలు లేకుండామీడియాకు రోజు గడవడంలేదు. కొద్ది రోజుల క్రితం తన ఆరోగ్యం పై వచ్చిన పుకార్లలలో నిజం లేదని సమంత ఖండించింది ఆ వెనువెంటనే సమంతా సిద్దార్దల ప్రేమ బ్రేకప్ అయిపోయిందని వార్తలు హడావిడి చేసాయి. అయినా మన మాయలేడి మాత్రం ఇవేమీ పట్టనట్లు వరుస పెట్టి షూటింగ్ లలో హడావిడిగా ఉంటోంది.  ఎన్టీఆర్ తో ‘రభస’ సినిమాలో నటిస్తున్న సమంతా ప్రస్తుతం హైదరాబద్లో జరుగుతున్న ఈ షెడ్యుల్ పూర్తి అయిన వెంటనే సమంతా వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి పరిచయం అవుతున్న సినిమా షూటింగ్ కోసం సమంతా జపాన్ వెళ్ళుతోంది. అక్కడ సమంతా బెల్లంకొండ సాయి లపై ఒక రొమాంటిక్ సాంగ్ ను తీస్తారట. వచ్చే వారం కొత్త హీరోతో జపాన్ చుట్టిరావడానికి వెళుతోంది సమంత. ఈమెకు జపాన్ అన్నా జపాన్ ప్రజలన్నా చాలా ఇష్టం అని అంటోంది. 'జపాన్ కు వెళ్తున్న సోమవారం ప్రపంచంలోనే నాకు ఇష్టమైన జపనీస్ చూడనున్నా' అని ట్విట్ చేసింది. ఇప్పటికే ఈకొత్త హీరోతో నటించడానికి నిర్మాత బెల్లంకొండ దగ్గర 3 కోట్లు తీసుకున్న సమంత తనకిష్టమైన జపాన్ దేశంలో ఈ సినిమా నిర్మాత చేత ఎంత ఖర్చు పెట్టిస్తుందో చూడాలి. అంతేకాకుండా ఇప్పటికే దూరం జరిగాడు అని వార్తలు వస్తున్న సిద్దార్డ్ సమంత జపాన్ ప్రయాణం పై ఎంత జలసీ ఫీల్ అవుతాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: