బన్నీ పిల్లలకు కూడా సేమ్ ఎనర్జీ ఉంది!
ఇటువంటి నేపథ్యంలో తాజాగా చిల్డ్రన్స్ డే నాడు తన కొడుకు కూతురు తో చిత్రీకరించిన వీడియో మరియు మూడవ సాంగ్ విడుదల చేసి అభిమానులకు చిల్డ్రన్స్ డే నాడు గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ. తాజాగా విడుదలైన టీజర్ లో అర్హ, అయాన్ ఇద్దరూ ఎంతో సరదాగా డాన్స్ చేస్తు తండ్రి అల్లు అర్జున్ మాదిరిగానే ఎనర్జిటిక్ గా డాన్స్ చేశారు. ఇదే విషయాన్ని చూసిన అభిమానులు కామెంట్ రూపంలో బన్నీ పిల్లలకు కూడా సేమ్ ఎనర్జీ బన్నీ లాగానే ఉంది అని కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, బ్లేజి, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్ లు కలిసి ఈ సాంగ్ ని ఆలపించడం జరిగింది.
ఇక ఈ టీజర్ ని బట్టి గమనిస్తే ఇది కొంత వెస్ట్రన్ స్టైల్ లో సాగె సాంగ్ అని అర్ధం అవుతుంది. కాగా ఈ సాంగ్ టీజర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, మురళి శర్మ, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఫ్యాన్స్ కి ఉన్నాయి.