విశాల్ కోసం రానా ఏంతపని చేశాడో తెలుసా?

siri Madhukar
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనుమడు..స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు రానా దగ్గుబాటి హీరోగా వెండి తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా మొదటి సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘లీడర్’ మంచి విజయం అందుకుంది.   ఈ మూవీలో రానా సీఎం పాత్రలో నటించాడు. అయితే రానా నటించిన తర్వాత సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. అయితే హీరోగా తన కెరీర్ ప్రారంభించినా..ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పిస్తున్న రానా బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లో నటిస్తున్నారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2 ’ భళ్లాలదేవ గా నటించిన రానా జాతీయస్థాయిలో మంచి గుర్తింపు పొందాడు.

గత కొంత కాలంగా రానా అనారోగ్యంపై రక రకాల రూమర్లు వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే రానా ఫిజిల్ లో మార్పురావడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని..తనకు ఎలాంటి ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు లేవని..ఏదైనా ఉంటే తాను స్వయంగా సోషల్ మీడియా సాక్షిగా తెలుపుతానని రానా క్లారిటీ ఇచ్చారు.  తాజాగా రానా కొత్త అవతారం ఎత్తాడు.  కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న ‘యాక్షన్’ మూవీ కోసం రానా స్వయంగా ఓ పాట రాసి మరీ పాడారు. 


ఇక  సినీ పరిశ్రమలో ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌, పవన్‌ కల్యాణ్‌, రవితేజ, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ తమ నటనతోనే కాకుండా గాత్రంతోనూ అభిమానుల్ని అలరించారు. వీరి జాబితాలోకి రానా కూడా చేరారు. హిప్‌హాప్‌ సంగీత సారథ్యంలో ఈ పాట రూపొందింది.ఈ సందర్భంగా హిప్‌హాప్‌ ట్వీట్‌ చేశారు. ‘రానా తొలిసారి పాట పాడారు. ఆయన ఈ గీతాన్ని ఎంతో అద్భుతంగా ఆలపించారు. థాంక్యూ రానా అన్న’ అని పోస్ట్ చేశారు. దీనికి రానా రిప్లై ఇచ్చారు. ‘నువ్వు లేకపోతే నేను ఈ సాహసం చేసి ఉండను.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 
For the first time ever, @RanaDaggubati raps 😎
Been a huge fan of him and he spit 8bars for the telugu version of #LightsCameraAction - 🤟🏻🤟🏻🤟🏻Thank you rana anna, U R DA COOLEST 🎉 pic.twitter.com/YwNHzmdIdg

— Hiphop Tamizha (@hiphoptamizha) November 10, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: