రౌడీబేబికి గద్దలకొండ గణేష్ బేబి స్పాట్ పెట్టింది. హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవికి పూజా హెగ్డే తను వేడెక్కించే అందాలతో చెక్ పెట్టబోతుంది. సాయిపల్లవి వీడియోసాంగ్ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయిపల్లవి వీడియోకి పూజా హాట్నెస్ అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. గద్దలకొండ గణేష్ చిత్రంలోని వెల్లువచ్చేగోదారమ్మ ప్రోమోకే యూట్యూబ్‌లో రికార్డు స్ధాయి వ్యూస్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ పాట ఫుల్ వీడియోని అప్లోడ్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఈ పాటకు పదిలక్షల వ్యూస్ దక్కడం విశేషమనే చెప్పాలి. వరుణ్, పూజా డాన్స్ పెర్ఫార్మెన్స్తో పాటు ఈ పాటలో పూజా నడుఒంపుల అందాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటకి వచ్చిన వ్యూస్ చూస్తుంటే వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే సాంగ్, రౌడీ బేబి సాంగ్ రికార్డులు చెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేసాడు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన దేవత సినిమాలోని పాట ఇది. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ పాట అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కచ్చితంగా ఈ పాట యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
ఎన్టీఆర్ అరవింద సమేత, మహేష్ బాబు మహర్షి సినిమాలు సూపర్ హిట్ తర్వాత గద్దలకొండగణేష్ అటు బాలీవుడ్లో చేసిన హౌస్ ఫుల్ 4 సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా చేసే ముందే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో, ప్రభాస్ తో జాన్ సినిమాకు సైన్ చేసింది. ఈ రెండు సినిమాల మినహా పూజా మరో సినిమాకు సైన్ చేయలేదు.