దమ్ముంటే పేరు చెప్పు పూనమ్ కౌర్ కి ఛాలెంజ్ చేసిన శ్రీ రెడ్డి!
ఇటువంటి తరుణంలో తాజాగా శ్రీ రెడ్డి ఇటీవల హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ నీ ఉద్దేశించి పూనం కౌర్ కి ఛాలెంజ్ విసిరింది. డీటెయిల్ గా విషయంలోకి వెళ్తే ఇటీవల పూనమ్ కౌర్ ట్విట్టర్లో...ఒక ట్వీట్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అంతే కాకుండా అనేక ఆరోపణలు మరియు అనుమానాలను తీసుకువచ్చింది. ఇంతకీ పూనమ్ చేసిన ట్వీట్ కు తెలుగీకరిస్తే.. అబద్ధం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ నాయకుడు.. ఎప్పటికీ లీడర్ మాత్రం కాలేడంటూ ట్వీట్ చేసింది.
ఇంతకీ తాను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానన్న విషయాన్ని పూనమ్ బయటపెట్టలేదు. ఈ ట్వీట్ కు తాజాగా రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి. దమ్ముంటే ధైర్యంగా ట్వీట్స్ చేయ్.. పేరు పెట్టు.. మావాడు చూసుకుంటాడు.. అంతేకానీ ఈ దొంగచాటు ట్వీట్లు ఎందుకంటూ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. మరి శ్రీ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కి హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తుందో లేదో చూడాలి.