ప్రామిస్ చేసి మాటతప్పిన మహేష్ !!

K Prakesh
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గుణ శేఖర్ దర్శకత్వంలో చాల సంవత్సరాల క్రితం ‘అర్జున్’ సినిమా నిర్మిస్తున్నప్పుడు ఆ సినిమా కోసం అచ్చు మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలిన సెట్ ఒకటి ఆసినిమాకోసం గుణ శేఖర్ వేసాడు. అప్పట్లో సెట్ వ్యవహారం టాక్ ఆఫ్ టాలీవుడ్ ఆ సెట్లో అర్జున్ సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు గుణ శేఖర్ కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి కధను సినిమాగా తీస్తే బాగుంటుందని ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనను అప్పట్లో గుణ శేఖర్ ఆ సినిమా హీరో మహేష్ కు వివరిస్తే ఈ ఆలోచన బాగుంది అని ప్రోత్సహించాడట.  మహేష్ ఇచ్చిన ప్రోత్సాహంతో అదే మీనాక్షి అమ్మవారి సెట్లో రాణి రుద్రమ ట్రైల్ షూట్ కు ఏర్పాట్లు చేసి బాలరామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సీతగా నటించిన స్మితా మాధవ్ ను హడావిడిగా పిలిపించి ఆమెకు రుద్రమదేవి గెటప్ వేసి ట్రైల్ షూట్ చేసి మహేష్ కు చూపించాడట గుణ శేఖర్. ఇది కూడా చాల బాగుంది అని మహేష్ అనడంతో తాను తీయబోయే రాణి రుద్రమ్మలో అత్యంత ముఖ్యమైన పాత్ర గోన గన్నారెడ్డి పాత్రను మహేష్ ను నటించాలి అని అడిగితే అప్పట్లో మహేష్ అంగీకరించాడట. అయితే సంవత్సరాలు గడిచిపోయి మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయిన దశలో గుణ శేఖర్ తన రుద్రమదేవిని అనుష్క తో ప్రారంభించి గోన గన్నారెడ్డి పాత్రకు సంబందించి మహేష్ తనకిచ్చిన మాటను గుణ శేఖర్ గుర్తుకు చేసాడట.  మహేష్ తాను ఆరోజులలో ఇచ్చిన మాట తనకు బాగా గుర్తుందని చెపుతూ తన డేట్స్ అన్నీ ‘ఆగడు’ సినిమా కోసం బల్క్ గా ఇచ్చేయడంతో తాను గుణ శేఖర్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతున్నానని సారీ అన్నాడట. దీనికి కొద్దిగా బాధ పడ్డ గుణ శేఖర్ మహేష్ తనకు ఇచ్చిన మాట తప్పాడు అంటు తన సన్నిహితుల దగ్గర బాధ పడుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: