ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తన తర్వాత సినిమా క్లాస్ సినిమా చేయాలా లేకపోతే మాస్ సినిమా చేయాలా అన్న డైలమాలో రామ్ ఉండిపోవడంతో..రామ్ నెక్స్ట్ తీయబోయే సినిమా పై అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో రామ్ ఇటీవల ఓ తమిళ సినిమా రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. మొదట ఈ సినిమా చేయకూడదు అని భావించిన చివరాకరికి చేయటానికి రామ్ సిద్ధమైనట్లు ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినబడుతున్నాయి. ఇక పూర్తిగా విషయంలోకి వెళ్తే గతంలో రాం తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, అన్ని సినిమాలు తెరకెక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ఈ తమిళ సినిమా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ పక్కన హీరోయిన్స్ గా నివేదిత పెతురాజ్, మాళవిక శర్మ నటించనున్నట్లు సమాచారం. ఆ సినిమా వివరాల్లోకి వెళితే తమిళంలో తెరకెక్కిన తడం అనే సినిమాని రామ్ తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రాబోయే సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారట.