పవన్ ను లేటెస్ట్ గా మరోకోణంలో వాడుకుంటున్ననితిన్ !

K Prakesh
హీరో నితిన్ ను పవన్ కు మరో దేముడు ఇచ్చిన తమ్ముడు అని టాలీవుడ్ లో సెటైర్లు వేస్తూ ఉంటారు. నితిన్ కూడా ఆపద్దతిలోనే పవన్ పై తనకున్న వీరాభిమానాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ పవన్ పాటలను తన సినిమాలకు టైటిల్స్ గా వాడుకుంటూ తన గత పరాజయాల ట్రాక్ కు పవన్ సబ్ధంలోని అదృష్టాన్ని తన కెరియర్ కు కూడా కోంత ఉపయోగ పడేలా అడుగులు వేస్తున్నాడు.  పవన్ కు అదృష్టాన్ని ఇచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను తన తండ్రి చేత నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయించి తాను లాభపడటమే కాకుండా పవన్ కు కూడా సిరులు కురిసేటట్లుగా చేసాడు. ఇదంతా గతం ఇక లేటెస్ట్ గా ఓ అభిమాని రూపొందించాడు అంటూ ఈ ఫోటోను సోషల్ నెట్ వర్క్ లో ప్రోమోట్ చేసుకుంటూ పవన్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఫోటోలో నితిన్ తనకు తానే రాక్ స్టార్ గా బిరుదును క్రియేట్ చేసుకుని పవర్ స్టార్ పక్కన రాక్ స్టార్ అంటూ రూపొందించిన ఫోటో వెబ్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది.  ఈ ఫోటోను నిజంగానే నితిన్ అభిమాని క్రియేట్ చేసాడా లేక నితిన్ తనకు తానే క్రియేట్ చేసుకున్నాడా అనే విషయం పై ఫిలింనగర్ లో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. నితిన్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో పవన్ నామజపం చేయడానికి పూరి అంగీకరించడం లేదు కాబట్టి ఈ ఫోటో ద్వారా నితిన్ పవన్ భజన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు అని అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: