శ్రీముఖికి పెళ్లైతే వచ్చేవాడి పరిస్థితేంటో.. రాహుల్
అసలు శ్రీముఖికి పెళ్లి అయితే తన భర్త పరిస్థితి ఏంటి? అని రాహుల్.. వరుణ్ని అడగడంతో ఏమో నాకేం తెలుసు. పెళ్ళి అయ్యాక అలాగే అరుస్తుందేమో.. అలాగే అరిస్తే వినిపించకుండా ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశారు వరుణ్. ఇక పునర్నవి నన్ను ఉదయ్యాన్నే ఎదవ అని తిట్టిడంతోనే స్టార్ట్ చేసింది ఎందుకో తెలియడం లేదని రాహుల్ అనడంతో.. ఇష్టంతో తిడుతుందన్నాడు వరుణ్.
దీంతో బిగ్ బాస్ బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 1లో విజేతగా నిలిచిన వితికాకి, బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్లలో అసలు విజేత ఎవరో తేల్చాలని ఇంటి సభ్యులకు వదిలేశారు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి బొట్టు పెట్టాలని, ఇష్టంలేని కంటెస్టెంట్ తలపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి, మహేష్ తప్ప మిగిలిన వరుణ్, రాహుల్, అలీ, పునర్నవిలు వితికా గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ అనుకున్న విదంగా వితికాను బెస్ట్ పెర్ఫామర్‌ని చేసి బాబా తలపై గుడ్డు పగలగొట్టి విలన్‌కి చేశారు. మొత్తంగా బాబా బాస్కర్ వేస్ట్ అని.. వితికా తోపు అంటూ పొగడ్తలు వర్షం కురిపించారు పున్నూ అండ్ బ్యాచ్.