మంచు ఫ్యామిలీకి పాండవుల సెంటిమెంట్ ...

K Prakesh
కుటుంబ కధా చిత్రాలకు ఆధరణ బాగా లభిస్తూ ఉండడంతో మల్టీస్టారర్ సినిమాల కాలం వచ్చింది. మంచు వారి కుటుంబ సినిమాగా మొత్తం వారి కుటుంబ సభ్యులంతా నటిస్తున్న మంచు ఫ్యామిలీ మూవీకి పాండవులు పాండవులు తుమ్మెదా అనే పేరును నిశ్చయించినట్లు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న నటిస్తున్న ఈ సినిమాలో దాసరి కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు తెలుగ టైటిల్స్ పై మోజు ఏర్పడటంతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఈ టైటిల్ కు ఓటు వేసారని టాక్.  శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ సంస్థపై మంచు విష్ణు, మనోజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు, మనోజ్ సరసన హన్సిక, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టుకుని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘అత్తారింటికి దారేది' సినిమాలు సూపర్ హిట్ మూవీలుగా మారడంతో ఇటువంటి ప్రయోగాన్నే మంచు కుటుంబం కూడా చేస్తోంది అనుకోవాలి. శ్రీనువైట్ల నుండి కోన వెంకట్, గోపీ మోహన్ లు విడిపోయిన తరువాత ఈ రచయితలు కధ సమకూర్చిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ గతంలో వచ్చిన అక్కినేని ‘అక్కాచెల్లెళ్లు’ కృష్ణంరాజు తీసిన ‘కలియుగ పాండవులు’ సినిమాలలో ప్రస్తుతం మంచువారి సినిమా టైటిల్ ను పాటలకు పల్లవిగా వాడారు. అచ్చమైన జానపద సాహిత్యం నుండి వచ్చిన ఈ టైటిల్ నేటి లేటెస్ట్ యువతరానికి ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: