శ్రీరెడ్డి పై షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..!
అంతే కాకుండా తెలుగులో ఇంకా సినిమాలు చేస్తానని పేర్కొంది. ఇటీవల ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అవడంతో ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా తన అభిమానులకు మరియు తనపై వస్తున్న అనేక రూమర్స్ గురించి సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న వేయగా. షకీలా బదులిస్తూ తను శృంగార తారగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఇండస్ట్రీ నుండి లైంగిక వేధింపు ఎదురుకాలేదని.. కెమెరా ముందు అర్ధనగ్నంగా నటించడానికి ఇబ్బంది పడలేదని చెబుతూ.. పాపం శ్రీరెడ్డిలా గుడ్డలిప్పుకుని రోడ్డుమీద నిలబడలేను.
నా చేతుల కష్టంపై ఫైట్ చేసి వెనక్కి రాగలిగా అంటూ శ్రీరెడ్డికి పంచ్ వేసింది. అయితే ఇదే ప్రశ్న గతంలో ఒకసారి షకీలా కి వేయగా ఆమె మాట్లాడుతూ గతంలో ఓ ప్రముఖ నిర్మాత తాను షూటింగ్ అయిపోయి వెళ్తున్న సమయంలో వస్తావా అని అసభ్యంగా మాట్లాడాడని అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదని అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించిన సమయంలో షకీలా పేర్కొంది.