చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ అయిన హీరోయిన్..?

KSK
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి స్వాతంత్ర పోరాట యోధుడిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా లో నటిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా సాగుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ చరణ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించడానికి రెడీ అయ్యారు ఇదంతా మనకు తెలిసిన విషయమే.


అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవల డైరెక్టర్ కొరటాల శివ పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని ఫిలింనగర్ టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం...చాలా మంది తెలుగు హీరోయిన్లను అనుకున్నారు.  వారీలో అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి.


దీనికి సంబంధించిన ఎలాంటీ అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు చిరంజీవి ముగ్ధుడైనట్లు దాంతో కొరటాల శివ సినిమాలో తన పక్కన హీరోయిన్ గా కీర్తి సురేష్ కి చిరంజీవి అవకాశం ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: