‘జెర్సీ’పోటీ నుంచి తప్పుకుందా?!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత వరుస విజయాలు అందుకుంటున్నాడు నేచురల్ స్టార్ నాని.  ఒకటీ రెండు చిత్రాలు మినహా దాదాపు ఆరు చిత్రాలు వరుస విజయం అందుకున్నాయి.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా 'జెర్సీ' సినిమా నిర్మితమైంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.  ఈ చిత్రంలో  శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం ప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ఇంతకుముందు ప్రకటించారు. ఇదే రోజు అక్కినేని నాగచైతన్య, అక్కినేని సమంత నటిస్తున్న ‘మజిలీ’చిత్రం కూడా రిలీజ్ కాబోతుంది.  ఈ జంట వివాహం జరిగిన తర్వాత మొదటి సారిగా నటిస్తుండటంతో భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’చిత్రం ఏప్రిల్ లో కాకుండా మే 9 కి పోస్ట్ పోన్ అయ్యింది. 

దాంతో 'జెర్సీ'ని ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చేసినట్టు సమాచారం. కాకపోతే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.  ఒకవేళ జెర్సీ 19 న రిలీజ్ అయితే..రెండు వారాల ముందు మజిలీ రిలీజ్ అవుతుంది..దాంతో ఈ చిత్రాల మద్య పెద్దగా పోటీ ఉండకపోవొచ్చని భావిస్తున్నారు. 

ఇప్పటి వరకు చైతూకి నాని పోటీ ఇస్తారని భావించినా రిలీజ్ తేదీల్లో మార్పుజరిగితే మాత్రం ఎలాంటి పోటీ ఉండదు. మొత్తానికి చైతూ, నాని ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: