అక్కినేని పుట్టిన‌రోజుపై రంగుల‌ రాజ‌కీయం

Raja Shekar
అక్కినేని పుట్టిన‌రోజుపై గోల మొద‌లైంది. ఇప్పటి వ‌రకూ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్యామిలి వాతావ‌ర‌ణం కొంత వ‌ర‌కైనా ఉంది అని అనుకుంటున్న త‌రుణంలో అది కూడ క‌రువైందంటున్నారు నేటి ఫిల్మ్ స్టార్స్. అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్‌20 న జ‌రుగుతుంది. దాని త‌రువాత రోజున చెన్నైలో భార‌త సినిమా వందేళ్ళ వేడుక పండుగ జ‌రుగుతుంది. ఎన‌భైతొమ్మిది సంవ‌త్సరాలలోకి ఎంట‌ర్ అవుతున్న అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన‌రోజు వేడుక‌ల‌ని ఆ స్టేజ్ మీద జ‌రిపి గౌర‌వాన్ని అందివ్వాల‌ని టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబ‌ర్ అనుకున్నది. ఈ దిశ‌గా టాలీవుడ్ పెద్దల‌కు అక్కినేని బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి సంబంధించిన మేట‌ర్‌ను తెలియ‌ప‌రిచింది. ఇప్పటికే ఈ వేడుక‌ల‌కు టాలీవుడ్ దూరంగా ఉండాలంటూ మంచు మోహ‌న్‌బాబు కంచు కంఠంతో స‌సేమిరా అన్నాడు. 

మోహ‌న్‌బాబును స‌పోర్ట్ ఇచ్చేవారు ఒక వ‌ర్గంగా మారారు. టాలీవుడ్ ఫిల్మ్ వేడుక‌ల‌కి దూరంగా ఉండాల‌ని మ‌రో వ‌ర్గం రెడీ అయింది. ఇప్పుడు అక్కినేని పుట్టిన రోజును వందేళ్ళ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ‌ర‌ప‌టం విడ్డూరం అంటూ కొంద‌రు సినీ పెద్దలు దీనికి నో చెప్పేశారు. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో టాలీవుడ్ స్టానం చెప్పుకోద‌గినది. కోళీవుడ్,టాలీవుడ్ ఇండ‌స్ట్రీలు రెండూ సౌత్ ఇండ‌స్ట్రీకు రెండు క‌ళ్ళులాంటివి. అలాంటిది టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు సంబంధించిన ఓ సీనియ‌ర్ యాక్టెర్ 89వ సంవ‌త్సరంలోకి అడుగుపెడుతున్న సంద‌ర్బంగా ఆ వేధిక‌లో ఈ మాత్రం చోటు క‌ల్పింలేక‌పోవ‌డం అనేది టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రి విష‌పూరిత వాతావ‌ర‌ణానికి నిద‌ర్శణం అని కొంద‌రు ప‌బ్లిగ్‌గానే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: