వి.వి.రా, కథానాయకుడు ఫెయిల్యూర్స్ పై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్..?

Chakravarthi Kalyan
సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. కొత్త సినిమాలు రిలీజ్‌కు ఇంతకు మించిన సీజన్ మరొకటి ఉండదేమో.. అందుకే పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి క్యూ కడతాయి. కానీ ఈ సంక్రాంతి మాత్రం కేవలం మూడు, నాలుగు సినిమాలే రిలీజయ్యాయి.



బాలయ్య కథనాయకుడు, రామ్ చరణ్ వినయవిధేయ రామ, వెంకటేశ్ ఎఫ్‌ 2, రజినీకాంత్ పేట సంక్రాంతి కోడిపుంజులుగా బరిలో నిలిచాయి. వీటిలో అనూహ్యంగా వినయ విధేయ రామ, కథానాయకుడు బోల్తా కొట్టగా.. ఎఫ్‌ 2 కామెడీతో కాసుల వర్షం కురిపిస్తోంది. వినయ విధేయ రామ అయితే బాగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.



మరి ఈ రెండు సినిమాల మైనస్ పాయింట్లు ఏంటి.. ఈ విషయంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషించారు. బోయపాటి, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ వచ్చాయన్నారు. ఈ సినిమాలో ఫైట్లు మరీ ఎక్కువగా పెట్టడం మైనస్ పాయింట్ అయ్యిందన్నారు. బోయపాటి తన స్టైల్‌లోనే ఈ సినిమా తీశాడని కామెంట్ చేశారు.



ఇక కథనాయకుడు సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ బాగా వచ్చినా సెకండాఫ్‌పై అంతగా శ్రద్ధ పెట్టలేదని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. ఈ కారణంగా ఫ్యాన్స్ కూడా అసహనానికి లోనయ్యారని తమ్మారెడ్డి విశ్లేషించారు. ఇక ఎఫ్‌ 2 మాత్రం కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా బాగా పండటంతో హిట్ టాక్ తెచ్చుకుందన్నారు తమ్మారెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: