తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ డీఎస్సీ-2024 నిర్వహించింది. దీని ఫలితాలు సెప్టెంబరు 30న వచ్చాయి. డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు 1 అక్టోబర్ 2024 నుంచి 5 అక్టోబర్ 2024 వరకు సర్టిఫికెట్లు ఇచ్చారు. అలా ఎంపికైన టీచర్లకు, సీఎం రేవంత్ రెడ్డి 9 అక్టోబర్ 2024న హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగాతెలంగాణ డీఎస్సీ స్పోర్ట్స్కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నవంబర్20,21,22 వ తేదీల్లో సర్టిఫికెట్రీవెరిఫికేషన్చేయనుంది. కొంతమంది అభ్యర్థులు ఫేక్సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్కోటాలో ఎంపికైనట్లుగా ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మొత్తంగా 393 మంది సర్టిఫికెట్లను అధికారులు మరోసారి నిశితంగా పరిశీలించనున్నారు.
ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు బుధవారం ఈ కీలక సమాచారాన్ని అందించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రూప్-3 పరీక్షల ఏర్పాట్లు, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 5.36 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-3 పరీక్షలకు హాజరవుతున్నారని సీఎస్ తెలిపారు.పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ద్వారా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు శాంతికుమారి తెలిపారు. గ్రూప్-1 పరీక్షల మాదిరిగానే గ్రూప్-3 పరీక్షలను కూడా సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు స్వయంగా పర్యవేక్షించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు ఉండేలా చూడాలని, ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పరీక్షల నిర్వహణకు కమిషన్ చేసిన ఏర్పాట్లను సంక్షిప్తంగా సీఎస్‌కు వివరించారు. పరీక్షలను పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.