నడుమందాలతో చెమటలు పట్టిస్తున్న నటి..అప్పుడు పద్దతిగా..ఇపుడు కసిగా.?

FARMANULLA SHAIK
పూజిత పొన్నాడ ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.పూజిత అచ్చ తెలుగమ్మాయి. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఆమె.. ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్లపాటు టాటా కన్సటెన్సీలో జాబ్ చేసింది. ఆ తర్వాత 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2016లో తుంటరి తో మొదటి సారి బిగ్ స్క్రీన్ పై కనిపించింది.ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నారా రోహిత్ హీరోగా వచ్చిన తుంటరి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తర్వాత దర్శకుడు, రంగస్థలం, బ్రాండ్ బాబు, రాజు గాడు, సెవెన్,కల్కి, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, ఓదెల, రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.రంగస్థలం సినిమాలో ఆదిపినిశెట్టికి జోడీగా నటించింది ఈ భామ. అయితే రంగస్థలం తప్ప ఈమె  నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి. అందులోనూ ఈమె ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా సరైనవి కావు. ఓ మూలన పడేసే పాత్రలు లేదా, బోల్డ్ సన్నివేశాల్లో నటించే పాత్రలు ఎక్కువగా అలాంటివే చేస్తూ వచ్చింది. దీంతో ఈమెకు ఎక్కువ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.సోషల్ మీడియాలో అడపా దడపా ఫోటోలు షేర్ చేసి దర్శకనిర్మాతల కంట్లో పడాలని చూస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు సన్నజాజీలా ఉన్న పూజిత.. ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.పూజిత పొన్నాడ గిరిజన లుక్స్‌లో పడుచు పరువాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది. ఫొటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శించేస్తూ చిత్తు చేస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తుంది. పవన్ కల్యాణ్ మూవీ " హరి హార వీర మల్లు" లో కూడా నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: