వాణిశ్రీ అసలు పేరు అది కాదా.. ఆమె పేరు వెనుక పెద్ద కథే ఉందిగా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో వాణిశ్రీ ఒకరు. ఆమె అసలు పేరు రత్నకుమారి. ఈ పేరు చెబితే 'అసలు ఆమె ఎవరు?' అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆమె ఒరిజినల్ నేమ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ వాడలేదు. ఈ స్టార్ హీరోయిన్ కళాభినేత్రిగా మంచి పేరు తెచ్చుకుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకానొక దశలో తిరుగులేని హీరోయిన్‌గా రాణించింది. వాణిశ్రీ పేరు చెపితే ఈ తరం సినిమా ప్రేక్షకులకు కూడా ఆమె ఎవరో తెలుస్తుంది. మహానటి సావిత్రి తర్వాత మళ్లీ అంత టీం గొప్ప పేరు తెచ్చుకున్న నటీమణి వాణిశ్రీ. రత్నకుమారి అనే పేరు బాగానే ఉంది కదా, దాన్నే స్టేజ్ నేమ్‌గా ఆమె వాడకుండా పేరు ఎందుకు మార్చుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందుగా ఒక పెద్ద కథ తెలుసుకోవాల్సిందే.
వాణిశ్రీ కేరీర్ ప్రారంభంలో చిన్న వేషాలే వేసింది. హీరోయిన్ ఛాన్స్‌లు దక్కించుకోవడానికి ఆమెకు కొద్దిగా టైం పట్టింది. నెల్లూరులో రత్నకుమారిగా పుట్టిన వాణిశ్రీ చెన్నైలో పెరిగింది. అక్కడే డ్రామాలలో నటిస్తూ నటనపై మక్కువ పెంచుకుంది. ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ డ్రామాలు మాత్రమే చేసేది. అవే ఆమెలోనే నటనా నైపుణ్యాలను బాగా ఇంప్రూవ్ చేశాయి. ఈ ముద్దుగుమ్మ రక్త కన్నీరులో హీరోకి భార్యగా, చిల్లర కొట్టు చిట్టెమ్మలో చిట్టెమ్మ పాత్రలు చేసి తన నట విశ్వరూపం కనబరిచింది.
ఆమె హీరోయిన్‌గా చేసిన ఫస్ట్ సినిమా బంగారు పంజరం (1969). దానికంటే ముందు ఆమె 20 కి పైగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే వాణిశ్రీకి ఆ పేరు ఎవరో దర్శకులు అనుకుంటే పొరపాటే. ఆమెకు ఆ పేరు పెట్టింది దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు ఎస్వీ రంగారావు. ఎస్వీఆర్ వాణి ఫిలిమ్స్ పేరుతో ఒక ఫిలిం ఇండస్ట్రీ ని స్టార్ట్ చేశారు. తన బ్యానర్ పేరు అయిన వాణీ ఫిలింస్ పేరునే ఈ నటికి పెట్టాలని అనుకున్నారు వాణి అని పెడితే అంత ఆకర్షణీయంగా లేదని వాణిశ్రీ అని మార్చేశారు. అప్పటినుంచి రత్నకుమారి వాణిశ్రీ గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు - వాణిశ్రీ కాంబినేషన్ అప్పట్లో పెద్ద హిట్టు. దసరా బుల్లోడు, ప్రేమనగర్ లాంటి సూపర్ డూపర్ హిట్లతో ఈ జంట హిట్ పెయిర్ గా నిలిచింది.