ఎన్టీఆర్ మనసు బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా.. అలాంట పని చేస్తాడా..!

Amruth kumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇది పేరు కాదు ఒక బ్రాండ్ .. నటరత్న ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఎన్టీఆర్ .. తన బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులోనే యంగ్ టైగర్ గా త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. గొప్ప నటుడుగా, గొప్ప డాన్సర్ గా మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మ‌నిషిగా ఎందరో కోట్లాది మంది గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వచ్చిన దేవర సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజీ ఏంటో చూపించాడు ఎన్టీఆర్..

దేవరతో ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి .. బాలీవుడ్ హీరోల కు సవాల్‌ విసిరాడు . ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాల తో .. పాన్ ఇండియా బాక్సాఫీస్‌కు సవాల్ విసిరుతున్నాడు .అయితే ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే స్టార్ హీరోలు , సెలబ్రిటీలు  వారి లైఫ్‌లో   ఎన్నో టెన్షలు , ఇబ్బందులు ఉంటాయి . కొన్నిసార్లు తప్పు చేయకపోయినా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది . ఒకసారి గౌర‌వించిన వారే మరోసారి ఘోరంగా అవమానిస్తూ ఉంటారు .

ఇక అలాంటి పలు అనుకొని కారణాల వల్ల మూడాఫ్‌లు , చికాకులు సెల‌బ్రెటీల‌కు చాలా కామ‌న్ . అయితే మ‌న ఎన్టీఆర్  మూడ్ బాగో పోతే ఏం చేస్తాడో తెలుసా..? రూమ్ లోకి వెళ్లి ఒంట‌రి గా సినిమాలు చూస్తాడ‌ట . సినిమాలు చూస్తే ఎన్టీఆర్ మెద‌డు , మ‌న‌సు రీఫ్రెష్ అవుతాయ‌ట . మూడ్ వెంట‌నే ఛేంజ్ అవుతుంద‌ట . గ‌తంలో ఓ మూవీ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు . ఈ కామెంట్స్ ఇప్పుడు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: