విజయ్ సర్కార్ పై మండిపడుతున్న మహేష్ అభిమానులు !

Seetha Sailaja
దసరా సీజన్ ముగిసి పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చేనెల రాబోతున్న దీపావళి సీజన్ పై పడింది. ముఖ్యంగా తమిళనాడులో దీపావళి చాల పెద్ద పండుగ కాబట్టి ఆ పండుగను టార్గెట్ చేస్తూ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ మూవీని విడుదల చేస్తున్నారు. 

విజయ్ కు టాలీవుడ్ లో కూడ మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన టీజర్ ను మన తెలుగు ప్రేక్షకులు కూడ విపరీతంగా చూస్తున్నారు. క్రియేటివ్ అండ్ సోషల్ థీమ్స్‌ని ఆసక్తికరంగా తెరకెక్కించే మురుగదాస్ ఈసారి విజయ్ ని ‘సర్కార్’ గా చూపించబోతున్నాడు. 

ఈమూవీ ఒక సీరియస్ పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. విజయ్ టాలెంట్ లెవల్స్‌ని మరింత ఎత్తులో చూపించడానికి మురుగదాస్ ‘సర్కార్’ లో బాగానే కసరత్తు చేశాడు. విదేశాల్లో ఉంటున్న హీరో ఇండియాలో జరిగే ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించడానికి వచ్చి ఇక్కడున్న ఎలక్టోరల్ రొచ్చును కడిగేయ్యడమే సినిమా స్టోరీ లైన్‌. 

ఇప్పుడు ఈ పవర్ ఫుల్ స్టోరీ కథ గురించి తెలుసుకున్న మహేష్ అభిమానులు మురగదాస్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తమ సూపర్ స్టార్ మహేష్ కోసం ఎందుకు పనికిరాని ‘స్పైడర్’ కథను ఇచ్చిన మురగదాస్ విజయ్ కోసం మాత్రం పవర్ ఫుల్ స్టోరీని ఆలోచించి వ్రాసి మహేష్ కు అన్యాయం చేయడమే కాకుండా తన తమిళ అభిమానాన్ని చాటుకున్నాడు అంటూ మహేష్ అభిమానులు మురగదాస్ ను తమ కామెంట్స్ తో నిలదీస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: