చింతమనేని చిన్నోడు పరారీలో ఉన్నాడు. దొరికేదెన్నడు..?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది చింతమనేని ప్రభాకర్. ఈయన రాజకీయం, రౌడీయిజం రెండూ కలిపి ఒకే విధంగా చేస్తూ ఉంటాడు. అలాంటి చింతమనేని ప్రభాకర్  మొన్నటి ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున దెందులూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అయితే రాష్ట్రంలోని వైసిపి, టిడిపి  నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అందరిలో  సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఆయన సృష్టించిన రికార్డు ఏంటంటే క్రిమినల్ కేసులు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరికంటే ఈయన క్రిమినల్ కేసుల్లో ఒక మెట్టు పైననే ఉన్నాడు. 

ఇప్పటికే ఈయనపై 225, 224, 143, 149, 353, సెక్షన్ల కింద కేసులు అయ్యాయి. అంతేకాకుండా ఈ చింతమనేని చిన్నోడు ఎన్నికల అఫిడవిట్ లో 93 కేసులు నమోదయ్యాయని  తెలియజేశాడు. ఇక ఈ కేసులన్నీ చాలావన్నట్టు  తాజాగా మరో కేసులో కూడా కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  ప్రస్తుతం ఈ కేసు గురించి ఆందోళన చెందిన చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 13న ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొప్పులవారి గూడెం పోలింగ్ బూత్ సమీపంలో  ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.  

ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాకర్ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి  సినిమాల్లో ఏ విధంగా అయితే  చూపిస్తారో, ఆ విధంగానే పోలీస్ స్టేషన్ అంత తన అనుచరులు ఆక్యుపై చేసుకొని  రాజశేఖర్ అనే వ్యక్తిని బలవంతంగా బయటకి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ కేస్ కింద చింతమనేని ప్రభాకర్ తో పాటుగా 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్నటువంటి చింతమనేని అనుచర వర్గం అంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి  అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రస్తుతం  ఆరుగురు సిఐల స్పెషల్ టీంగా ఏర్పడి తెలంగాణ, బెంగళూరు, ఏపీ, ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరి ఈ చింతమనేని పోలీసులకు దొరుకుతాడా..లేదంటే అజ్ఞాతంలోనే ఉంటాడా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: