బిగ్ బాస్ 2 తెలుగు లో మొదటి నుంచి నాని చెబుతూనే వస్తున్నాడు..ఇక్కడ ఏదైనా జరగొచ్చు..అని. అన్నట్లు గానే బిగ్ బాస్ లో గత కొన్ని వారాల నుంచి చిత్ర విచిత్రాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తేజస్వి, సామ్రాట్ ఓ రేంజ్ లో ప్రేమమత్తులో కొట్టుకు పోయారు..అనుకోకుండా తేజస్వి ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత తనుష్, దీప్తి సునయన ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి వెళ్లి చూసే వారికి కంటకింపుగా తయారయ్యారు...చివరికి మొన్నటి ఎలిమినేషన్ లో దీప్తి సునయనా వెళ్లిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ట్విస్ట్ మొదలైంది.. ఈ మద్య సామ్రాట్, గీతా మాధురి మద్య ఎక్కువగా మాటలు..ఇక ఇకలు..పక పకలు నడుస్తున్నాయిని వార్తలు వస్తున్నాయి. ఇక ఈవారం బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యేందుకు మమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు కౌశల్, దీప్తి నల్లమోతులు. అయితే నేను కూడా కెప్టెన్ నామినేషన్లో ఉంటా అంటూ యాంకర్ శ్యామల ముందుకొచ్చింది.
తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ‘నీవెవరో’ టీం ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నీవెవరో’ మూవీ శుక్రవారం నాడు ప్రేక్షకులముందుకు వస్తుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ‘నీవెవరో’ చెప్పి పూజాను ప్రేమలో పడేయాలని సామ్రాట్‌కు టాస్క్ ఇచ్చారు ‘నీవెవరో’ టీం. దీంతో పూజాను ప్రేమలో పడేయడానికి శీర్షాసనం వేసి మరీ పూజా ప్రేమను పొందుకున్నాడు సామ్రాట్. ఇక గణేష్, దీప్తి, అమిత్‌లు గుడ్డు టాస్క్ చేసి మెప్పించే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. ‘నీవెవరో’ లవ్ ప్రపోజ్ టాస్క్‌లో భాగంగా.. కౌశల్‌ను బిగ్ బాస్‌గా ఊహించుకుని అతన్ని ప్రేమలో పడేయాలని సింగర్ గీతా మాధురికి టాస్క్ ఇచ్చారు. దాంతో గీతా మాధురి తన కమ్మనైన మాటలతో..చిలిపి చేష్టలతో కౌశల్ కి లవ్ ప్రపోజల్ చేసింది..కానీ బిగ్ బాస్ గా ఉన్న కౌశల్ మాత్రం గీతా ప్రపోజల్ కి ససేమిరా అన్నాడు. అంతే కాదు బిగ్ బాస్ ని డిస్ట్రబ్ చేస్తే బాగుండదని.. దూరంగా ఉండు, పట్టుకోవద్దు, నిన్ను ఎలిమినేషన్ చేస్తా అంటూ హెచ్చరించినా గీతా మాధురి వెనక్కితగ్గలేదు. బిగ్ బాస్‌ను అంటిపెట్టుకుని పైపై పడింది. బిగ్ బాస్ మాత్రం కనికరించలేదు.