మెగా ఫ్యామిలీ మీద లోకేష్ ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు..!

Prathap Kaluva

ప్రతి సభలో పవన్ కళ్యణ్ లోకేష్ గురించి విమర్శలు చేయకుండా వదిలి పెట్టడు. నిజం చెప్పాలంటే ప్రతి పక్షం లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మీద కూడా అన్ని విమర్శలు చేయడేమో.. అయితే ఒక పక్క లోకేష్ మీద పవన్ విరుచుకు పడుతుంటే లోకేష్ మాత్రం పవన్ మీద ఎటువంటి విమర్శలు చేయడం లేదు. పవన్ మంచోడు.. గౌరవం.. అంటూ సినిమా డైలాగులు చెబుతున్నాడు.


ఈ విధంగా పవన్ కల్యాణ్ ను పూర్తిగా దూరం చేసుకోకూడదు.. అనే ప్రయత్నం కనిపిస్తోంది లోకేష్ వైపు నుంచి. ఇక తాజాగా చిరంజీవికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశాడు చినబాబు. చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పడం కేవలం రొటీన్ అనుకోవడానికి లేదు. చినబాబు మెగా టచ్ కోసం పాట్లు పడుతున్నాడు అనేందుకు ఇది నిదర్శనం. ఒకవైపు పవన్ పై గౌరవం అంటూ, మరోవైపు ఇప్పుడు చిరంజీవినీ రంజింపజేయడానికి లోకేష్ ఈ ట్వీట్ల పాట్లు పడుతున్నాడు.


మరి ఈ మెగా టచ్ తో ఆ హీరోల అభిమానుల ఓట్లు పొందుదాం అనుకుంటున్నాడో, కాపుల ఓట్లను టార్గెట్ గా చేసుకున్నాడో! అయినా పైకి ఒక కథను నడిపిస్తూ లోపల మరో కథ నడిపించడం నారా వాళ్లకు కొత్త ఏమీకాదులే. ఈ విషయాన్ని పవన్ కల్యాణే చెప్పాడు. తనపై లోకేష్ ఆధ్వర్యంలో కుట్ర జరిగిందని, కొన్ని మీడియా వర్గాలతో కలిసి లోకేష్ మొత్తం నాటకాన్ని నడిపించాడని, తన తల్లిని కూడా తిట్టించాడని పవన్ కల్యాణ్ కొన్నాళ్ల కిందట చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: