ఆరు సంవత్సరాలు కష్టపడ్డారు.. రాత్రి, పగలు అని తేడా లేకుండా పని చేశారు. కానీ చివరకు వారు ఊహించని విధంగా నష్టపోయారు. తాజాగా 113 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. చైనాకు చెందిన ‘అలీబాబా పిక్చర్స్ సంస్థ’ ‘అసుర’ అనే సినిమాను రూ. 700 కోట్లు ఖర్చు చేసి.. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్ వాడి.. భారీ అంచనాలతో శుక్రవారం సినిమాను విడుదల చేసింది. కానీ చిత్ర బృందానికి కలలో కూడా ఊహించని షాక్ తగిలింగింది.రూ. 700 కోట్లు ఖర్చు చేసి ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ భావిస్తారు...భారీ అంచనాలే నెలకొంటాయి. కానీ..ఆ సినిమా అట్టర్ ఫ్లాపవుతుందని, తొలి వారంలోనే సినిమా థియేటర్ల నుంచి తొలగిస్తారని చిత్రబృందం కలలో కూడా ఊహించి ఉండదు.
ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా పిక్చర్స్ సంస్థ ‘అసుర’ అనే సినిమాను తెరకెక్కించింది. చైనా చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. టిబెటన్ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం భారీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ను వాడారు. వారం తిరగకముందే పలు థియేటర్లు.. ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ తొలిగించారు. ఈ సినిమా చూడాలని అనుకునే వారు తమను క్షమించాలని.. ప్రేక్షకాదరణ లేకపోవడం వలనే సినిమాను తొలగిస్తున్నామని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చెత్త సినిమాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
చైనా సినీ చరిత్రలోనే అత్యంత చెత్త సినిమాగా నిలిచింది. అసుర సినిమా బడ్జెట్ లోని సగం బడ్జెట్ కూడా చైనా సినిమాలకు ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టలేదట. తొలిసారిగా భారీ బడ్జెత్ తో తెరకెక్కిన చైనా సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. చైనా సంస్కృతి, సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ ఈ సినిమా తెరకెక్కించడంతో.. ప్రేక్షకులకు ఆకట్టకుంటుందని భావించామని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని యాంగ్ హోంగ్ టావో అనే నిర్మాత తెలిపాడు.
ఈ సినిమా మొత్తం ఊహాలోకంలో నడుస్తుంది..చైనీయుల సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ అవుతారని అనుకున్నాం’ అని సినిమా నిర్మాతల్లో ఒకరైన యాంగ్ హోంగ్టావో తెలిపారు. నిడివి 141 నిమిషాలు. హాంగ్‌కాంగ్‌కు చెందిన నటులు టోనీ కాఫాయ్, కరీనా లౌ నటించారు. చైనాలో అతిపెద్ద రివ్యూ ప్లాట్‌ఫాం అయిన డౌబాన్ ఈ సినిమాకు కేవలం 3.1 రేటింగ్స్ ఇచ్చింది.