రజినీకాంత్ '2.0' రిలీజ్ డేట్ వచ్చేసింది!

siri Madhukar
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సెన్సేషనల్ హిట్ అయ్యింది.  భారత దేశంలోనే కాదు విదేశాల్లో సైతం రికార్డు మోత మోగించింది.   ఇదే కాంబినేషన్ లో ఇప్పుడు రోబో 2.0 సినిమా రాబోతుంది.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.   దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన '2.0' చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ప్రకటించగా, ఆయన అభిమానులు అప్పుడే సంబరాలకు దిగారు. 

రజనీ కెరీర్ లో రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల కావడం గత 23 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది వేసవిలో పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' విడుదలైన సంగతి తెలిసిందే. 1995లో ఆయన నటించిన ముత్తు, బాషా చిత్రాలు విడుదల అయ్యాయి. ఇదిలా ఉంటే..  "హాయ్ ఎవ్రీవన్... చిట్టచివరికి వీఎఫ్ఎక్స్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ డేట్ ను ఎనౌన్స్ చేశాయి. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది" అని శంకర్ ట్వీట్ చేశారు.

ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాలో గ్రాఫిక్ వర్క్ అధికంగా ఉన్న కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.
Hi everyone.. atlast the vfx companies promised the final delivery date of the vfx shots. The movie will release on nov 29th 2018.#2Point0 pic.twitter.com/ArAuo5KxM7

— Shankar Shanmugham (@shankarshanmugh) July 10, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: