తమ పాపులారిటీ పెంచుకోవడానికి చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారు : రాంచరణ్

Edari Rama Krishna
గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై దుమారం రేపుతున్న శ్రీరెడ్డి నిన్న పవన్ కళ్యాన్ ని టార్గెట్ చేసుకొని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది.  అలాగే ఆయన తల్లిగారిపై కూడా కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నారు.  శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేయాల్సింది పోయి వ్యక్తిగతం మాట్లాడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గంలో కలకలం చేపింది.  ఓ వైపు ఫ్యాన్స్ ట్రోల్ పెడుతుంటే..మళ్లీ దానిపై శ్రీరెడ్డి కామెంట్ చేయడం..పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ పై విరుచుకు పడింది. దాంతో ఈ వివాదం శృతిమించి పోవడంతో..మెగా బ్రదర్ నాగబాబు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు..అయితే వారికి నచ్చిన నటులను వారే తీసుకుంటారు..అందులో మాటాంటి వారి ప్రమేయం ఉండదు..ముఖ్యంగా ‘మా’ అసోసియేషన్ వారు కూడా జోక్యం చేసుకోలేరని..ఒకవేళ నిర్మాతకు నష్టం వస్తే వారు భరించగలరా అని ప్రశ్నించారు.  అంతే కాదు కాస్టింగ్ కౌచ్ పై చవకబారు వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని..ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగు నటులు ఉన్నారని..వారంతా ఇలాంటి ఇబ్బందులు పడలేదని అందరూ అలాంటి వారే ఉంటే ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాదు తన తమ్ముడు పవన్ కళ్యాన్ అన్న మాటలు తప్పుబట్టడం హేయమైన విషయం అని..చట్ట ప్రకారం వెళ్లమనడం అనేది తప్పయితే..ఈ చెట్టాలు ఉన్నది ఎందుకు..పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు అని ప్రశ్నించారు.  తాజాగా ఇదే అంశంపై మెగా హీరో రామ్‌ చరణ్‌ తేజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. 'అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ.

మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి.  తమ పాపులారిటీ పెంచుకోవడానికి కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేస్తున్నారని ఇది ఎంతో చవకబారుతనంగా ఉంటుంది' అని ఆయన ఫేస్‌బుక్‌లో స్పందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: