అందాల ముదురు భామల సెకండ్ ఇన్నింగ్స్..!? అదరహో..!

Chakravarthi Kalyan
వాళ్లంతా ఒకప్పుడు సినీసీమను ఏకచత్రాధిపత్యంగా ఏలిన ముద్దుగుమ్మలే.. కానీ పాపం.. ఎంతైనా హీరోయిన్ల లైఫ్ హీరోలతో పోలిస్తే తక్కువే కదా. అందులోనూ ఓ ఐదారేళ్లు స్టార్ డమ్ ఉందంటేనే గొప్ప.. ఆ తర్వాత ఎంతటి వారైనా కనుమరుగు కావాల్సిందే. ఎందుకంటే ప్రేక్షకులు కొత్త అందాలు కోరుకుంటుంటారు కదా. 



కానీ అలా కనుమరుగైన అందమైన భామలు..  మళ్లీ కొంతకాలం తర్వాత ముదురు అందాలతో మరోసారి తమ సత్తా చాటేందుకు వస్తుంటారు. కాకపోతే.. ఈసారి హీరోయిన్ పాత్రలు కాకపోయినా కాస్త ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెబుతున్నారు. ఒకప్పుడు ఒక్కడు, ఖుషీ వంటి బ్లాక్ బస్టర్లతో అలరించిన భూమిక ఇటీవలే నానితో ఎంసీఏ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 



ఇప్పుడు మరికొందరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నారు. పదేళ్ల క్రితం ఓ ఊపు ఊపిన రాశి రెండేళ్ల క్రితం రీ ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ వైభోగమే, ఆకతాయి, లంక సినిమాల్లో నటించింది. యమలీల, సొగసు చూడతరమా సినిమాలతో ఒకప్పుడు అలరించిన ఇంద్రజ కూడా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


దిక్కులు చూడకు రామయ్య, శమంతకమణి, శతమానం భవతి, అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు ఒక ఊపు ఊపి.. ఆ తర్వాత తెరమరుగై అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్న రంభ కూడా ఫుల్ టైమ్ రీఎంట్రీకి సిద్దమైపోయిందట.



సప్తగిరితో ఓ సినిమాలో కీ రోల్ పోషిస్తోందట. అలాగే లయ కూడా త్వరలోనే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందట. మరి ఈ ముదురు అందాలు ఏమేరకు అలరిస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: