బతుకుతానని అస్సలు అనుకోలేదు : హీరోయిన్
ఇక ఈ మధ్యకాలంలో అయితే ఎంతో మంది హీరోయిన్లు తమ పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీలు చెప్పే విషయాలు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. ఇక కొంతమంది అయితే ఏకంగా తమ ఆరోగ్య సమస్యల గురించి కూడా అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాల ఇక తాను అనారోగ్య సమస్యలతో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల చెప్పకు వచ్చింది. కనీసం తాను బ్రతికి బట్ట కడతాను అని అనుకోలేదు అంటూ షాకింగ్ విషయాలు చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్.
మనిషా కొయిరాల గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనిషా కొయిరాల క్యాన్సర్ వ్యాది వచ్చినప్పుడు ఎదురైనా ఘటనల గురించి చెప్పుకొచ్చింది. క్యాన్సర్ తో పోరాడిన సమయంలో అనుభవించిన బాధను పంచుకుంది. అండాశయ క్యాన్సర్ నాలుగో దశకు చేరడంతో జీవితం పై ఆశలు వదులుకున్నా. ఎంతకాలం బ్రతుకుతానో అనుకుంటూనే జీవితాన్ని గడిపాను. అదృష్టవశాత్తు క్యాన్సర్ ను జయించాను. ఇక ఇప్పుడు హిరామండి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా రెండో జీవితాన్ని ప్రారంభించాను అంటూ మనిషా కొయిరాలా చెప్పుకొచ్చారు.