దేవి గారూ....వింటున్నారా..73% సెక్స్ కావాలంటున్నారు..!

Edari Rama Krishna
తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎప్పుడూ తనదైన స్టైల్లో వివాదాలకు తెరలేపే రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. వివాదాలు, విమర్శలు, తిట్లు, నిరసనలు, ఆందోళనలు, కేసులు నేపథ్యంలోనే తన లేటెస్ట్ మూవీ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' మూవీపై మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు.  ఎన్ని అడ్డంకులు ఎదురైనా..తన సినిమా విడుదల చేసి తీరుతా అని పట్టుబట్టిన రాంగోపాల్ వర్మ అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయలేక పోయారు. 

కాకపోతే ఆ రోజు లక్షల మంది నెటిజన్లు ఆ సినిమా చూడటానికి ప్రయత్నించడంతో క్రాష్ అయ్యిందని..జనవరి 27న రిలీజ్ చేశారు.  ఆన్‌లైన్‌లో విడుదలైన ఆర్జీవీ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉండటంతో తెగ సంతోషంలో మునిగిపోయాడు.  'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్'  రిలీజ్ కి ముందు ఎన్నో ఛానల్స్ లో డిబెట్ కార్యక్రమాన్ని పెట్టారు. 

ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ డిస్కషన్లో మహిళాసంఘం నాయకురాలు దేవికి, వర్మకు కాస్త గట్టిగానే వాదన నడిచింది. ఇలాంటి సినిమాను సమాజంపై రుద్ది ఏం సాధించాలనుకుంటున్నావ్ అంటూ దేవి మండిపడితే, మీరు ఎన్ని సినిమాలు చూశారు అంటూ వర్మ ఘాటు రిప్లై ఇచ్చారు. ఆ దుమారం గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దేవి వర్మపై మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. 

కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాజాగా తన ట్విట్టర్లో జీఎస్టీ సినిమాపై వర్మ ఒక పోల్ నిర్వహించారు. జీఎస్టీ సినిమా నుంచి స్ఫూర్తి పొందిన ఐ లవ్ సెక్స్ టూ అన్న క్యాంపెయిన్ లో మీరు నాతో కలవగలరా..? అని వర్మ కండక్ట్ చేసిన పోల్ కు 73 శాతం అనుకూలంగా ఓటు వేశారు. సుమారు లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ పోల్ లో 73 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. దేవీ గారూ..వింటున్నారా..? అంటూ కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
.#ILuvSexToo poll results won an ASTOUNDING 73% MAJORITY to just a paltry 27% for the protesters😂 #GodSexTruth @ITooLoveSex_GST pic.twitter.com/0cu1nP1YHb

— Ram Gopal Varma (@RGVzoomin) January 30, 2018More than one lakh people voted on #GodSexTruth poll and 73% voted in favour..Devi garooooo vintunnaraaa 💪💪💪💐💐💐🍾🍾🍾💃💃💃💃 pic.twitter.com/oRMq37cCff

— Ram Gopal Varma (@RGVzoomin) January 30, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: