వర్మ కూతురి పెళ్ళి సందడిలో పవన్ హడావిడి...
రామ్ గోపాల్ వర్మకు సెంటిమెంట్లు లేవు తనకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదనీ అందుకనే తన భార్య తను కలిసి ఉండటం లేదని చాలాసార్లు అన్నాడు. అయితే తన కూతురు తనకి దూరంగా ఉన్న తనేప్పుడు ఆమె గురించే ఆలోచించే వాడనని అని అంటాడు. హిందూ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పే వర్మ తన కూతురు పెళ్ళి యార్పాట్లను మాత్రం దగ్గర ఉండి చేస్తున్నాడు. అంతే కాకుండా బాగా నచ్చిన వాల్లందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాడు.రాంగోపాల్ వర్మ కూతురు రేవతి పెళ్ళి ఈ నెల ఆగష్టు 15నజరగబోతోంది. వర్మ కూతురు ఇప్పటికే డాక్టర్ చదువును పూర్తి చేసి మరో డాక్టర్ ను ప్రేమించి పెళ్ళి చెసుకుంటోoది.
హైదరాబాద్ లో జరగబోయే ఈ వివాహ వేడుకకు కేవలం కొద్దిమందిని మాత్రమే వర్మ ఆహ్వానిస్తున్నాడట. అయితే ఈ వేడుకకు రాంగోపాల్ వర్మ తనకు నచ్చిన ఒక వ్యక్తిని ఆహ్వానించాడట. ఆ వ్యక్తి ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కూడా ఈ పెళ్ళికి వచ్చి రేవతిని ఆశీర్వదిస్తాను అని అన్నాడట. ఈమధ్యనే పవన్ గురించి రాంగోపాల్ వర్మ గొప్పగా పొగుడుతూ ట్విట్టర్ లో ఓ రేంజ్ లో కామెంట్స్ పెట్టాడు. ఈ పొగడ్తలను చూసి పవన్ ఫ్యాన్స్ కూడా చాలా మంది కుషీగా ఉన్నారట.
ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ పవన్ ను ఇలా ఆకాశానికి ఎందుకు ఎత్తేస్తున్నాడు అంటూ ఆసక్తి కర చర్చలు జరుగుతున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ కూతురు పెళ్ళిలో హడావిడి చేయడం సంచలనమే. మరి వీరిద్దరి కలయిక భవిష్యత్తులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఇస్తుందో చూడాలి.....