చిరంజీవిని నిరాశపరిచిన ఆటాప్ హీరో !
ఊహలు గుసగుసలాడే’ మూవీ నుండి ‘జ్యో అచ్యుతానంద’ వరకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలలో నటించిన నాగశౌర్య నేటి తరం యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇతడు లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘ఛలో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ ఫంక్షన్ లో చిరంజీవి చేసిన ఉపన్యాసం చాలామందిని ఆశ్చర్య పరిచింది. గతంలో చిరంజీవి నాగశౌర్య కలిసి తీయించుకున్న ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా లేకపోయిన నాగశౌర్య ఫంక్షన్ సినిమాకు చిరంజీవి రావడం ఏమిటి? అని చాలామందికి అనిపిస్తోంది అంత షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు మెగా స్టార్. తనను కలవాలని నాగశౌర్య రెండుమూడు సార్లు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినా తాను అందుబాటులో లేక రెస్పాన్స్ కాలేకపోయిన విషయాన్ని వివరిస్తూ చివరకు నాగసౌర్య ఒత్తడితో తానూ ‘ఛలో' సినిమా ఫంక్షన్ కోసం వచ్చిన విషయాన్ని వివరించాడు.
నాగశౌర్య తన తల్లితో కలిసి ఈఫంక్షన్ కోసం వచ్చి తనను కలిసిన వెంటనే తాను ఎక్కువ సేపు ఆలోచించలేదు అంటూ నాగశౌర్య ఫంక్షన్ కు తాను రావడానికి ఒప్పుకోవడం వెనుక ఉన్న ఒక కారణం వివరించాడు చిరంజీవి. తన కెరియర్ బిగినింగులో తన సినిమా ఫంక్షన్ కు తాను అప్పట్లో అభిమానించే పెద్ద స్టార్ ను అతిధిగా పిలిచినప్పుడు ఆయన బిజీగా ఉండటంతో రాలేకపోయిన విషయాన్ని వివరిస్తూ ఆ సమయంలో ఆ టాప్ హీరో తన ఫంక్షన్ కు రాలేక పోవడంతో అప్పట్లో తాను చాలా డిసప్పాయింట్ అయిన విషయాన్ని వివరించాడు. అటువంటి పరిస్థితి నాగశౌర్యలోచూడటం తనకు ఇష్టం లేక తాను ఈ ఫంక్షన్ కు వచ్చిన విషయాన్ని వివరించాడు.
ఒక టాప్ హీరో ఒక
హీరో ఫంక్షన్ కు వచ్చి అతడి సినిమాకు సపోర్ట్ ఇస్తే ఆ యంగ్ హీరోకి వచ్చే ఫీలింగ్
తనకు తెలుసు అని అంటూ వాస్తవంగా చెప్పాలంటే నాగశౌర్య సినిమాలు ఏవి పెద్ద స్క్రీన్ పై చూడలేదు అయితే నిహారికతో చేసిన సినిమా మాత్రం
టీవీలో చూశానుఅని కామెంట్స్ చేసాడు. ఇదే
సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ గత రెండుమూడేళ్లుగా తీసుకుంటే పెద్ద హీరోలతో
సమానంగా కొత్త హీరోల సినిమాలు హిట్టయ్యాయి అన్న విషయాన్ని ఎలివేట్ చేస్తూ చిన్న
సినిమాలకు పెరుగుతున్న ఆదరణను అంగీకరించాడు. ఇదే సందర్భంలో నాగశౌర్య మాట్లుడుతూ మెగాస్టార్ తో పోలిస్తే తానూ చాలచాలా చిన్న వాడిని అని అంటూ తనకు మళ్లీ
జన్మంటూ ఉంటే తన తల్లి తండ్రులకు కొడుకుగా పుట్టడమే కాకుండా మెగాస్టార్ అభిమానిగా
పుడతానుఅంటూ మెగా అభిమానులను అందరినీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించాడు నాగ శౌర్య..
.