అక్కడ డీజే కి కష్టాలు తప్పవా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం గత నెల 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్ల పరంగా సూపర్ అనిపించుకున్నా..తర్వాత డివైట్ టాక్ రావడంతో చిన్నగా తగ్గు ముఖం పట్టాయి.  ఇక ఓవర్సీస్ లో మాత్రం కష్టాలు తప్పేలా లేవంటున్నారు.

ఈ సినిమాని అక్కడ 8 కోట్లకు కొనుక్కున్నారు ,పైగా ఖర్చులు అలాగే మెయింటనెన్స్ మిగతా ఖర్చులు అన్నీ పోను 8 కోట్లు రావాలి అంటే ఓవర్ సీస్ లో 12 కోట్ల వరకు రాబట్టాలి కానీ ఇప్పటి వరకు అక్కడ వచ్చింది 6కోట్లు వసూళ్లు చేయడంతో టెన్షల్లో పడ్డారు.  దీంతో లాభం లేదనుకున్న చిత్ర యూనిట్  ప్రస్తుతం అమెరికా పర్యటన చేస్తోంది.  

ఈ మద్య సినిమా రిజల్ట్ కాస్తు వెనుకా ముందు అయితే..వెంటనే ఆ చిత్ర యూనిట్ రంగంలోకి దిగడం కామన్ అయ్యింది. వీళ్ళ వల్ల కొంతవరకు కలెక్షన్లు మెరుగు పడతాయి , అలాగే నష్టాలు తగ్గుతాయి కానీ అదే రీతిలో ఖర్చు కూడా ఉంటుంది మరి . మరే సినిమా ఈ వారం లేదు కాబట్టి అల్లు అర్జున్ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది . ఏమైనా సరే లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు రావడం ఖాయమని తేలింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: