షాకింగ్ న్యూస్ వర్మతో బాలకృష్ణ !

Seetha Sailaja
ప్రస్తుతం బాలకృష్ణ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నందమూరి అభిమానులే హడిలిపోతున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ తో సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఈమూవీ తరువాత ఫైయిల్యూర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ తో మరో సినిమాను చేయబోతున్నాడు. ఈ ఊహించని కాంబినేషన్స్ ను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ అదిరిపోతోంది. 

ఇది ఇలాఉండగా నిన్న జరిగిన బాలకృష్ణ పుట్టినరోజునాడు మరొక షాకింగ్ న్యూస్ ను లీక్ చేసి దర్శకుడు పూరిజగన్నాథ్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఫేస్ బుక్ లైవ్ చాట్ సందర్భంగా పూరి ఈ వ్యాఖ్య చేశాడు. 

‘మీతో పని చేస్తున్న బాలయ్య మీ గురువు రామ్ గోపాల్ వర్మతోనూ సినిమా చేస్తారా’ అంటూ ఒక అభిమాని పూరిని అడగ్గా ఎందుకు చేయరు ఖచ్చితంగా ఆర్జీవీ దర్శకత్వంలో బాలయ్య సినిమా వస్తుంది షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. దీనితో ఈ లైవ్ ఛాట్ ను ఆశక్తిగా పరిశీలిస్తున్న బాలకృష్ణ అభిమానులకు మైండ్ బ్లాంక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం వర్మ సినిమాలు అంటే హీరోలతో పాటు ప్రేక్షకులు కూడ రివర్స్ గేర్ లో పరుగులు తీస్తున్న నేపధ్యంలో ఇటువంటి సాహసాన్ని నందమూరి సింహం చేస్తాడా అన్న భయంలోకి బాలయ్య అభిమానులు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరైనా పొగడ్తలు పొగిడితే బుట్టలో పడిపోయే బాలకృష్ణ మనస్తత్వం ఎరిగిన వారు మాత్రం రామ్ గోపాల్ వర్మ పక్కాగా ప్లాన్ వేస్తే ఆ బుట్టలో బాలయ్య పడిపోయినా ఆశ్చర్యం లేడు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: