మా నాన్నను చంపేయండి- రవిబాబు




ఈ ఆవేదనా పూరిత స్వరం చలపతిరావు కుమారుడు తెలుగులో విలక్షణ దర్శక రచయితైన రవిబాబుది. తప్పు చేసిన వారు సామాన్యుడైతే పడే శిక్ష మాత్రం అసామాన్యం. తప్పు చేసిన వారు గొప్పవారైతే దాన్ని చూసీ చూడనట్లు పోతారు ఈ సినిమా వాళ్ళు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు. నందమూరి బాలకృష్ణ, ఒక ప్రజాప్రతినిధి, ప్రముఖ కథానాయకుడు, ఇద్దరమ్మాయిల తండ్రి (పైగా ఒక కూతురు ముఖ్యమంత్రి కోడలు ఒక మంత్రి సతీమణి) సంస్కారహీనంగా మహిళలపై చేసిన దౌర్భాగ్యకరమైన దురదృష్ఠకరమైన వ్యాఖ్యలకు ఈ లెఖ్ఖన "కాపిటల్ పనిష్మెంట్ వంద సార్లిచ్చినా  తక్కువే". మగువలపై, సహనటీమణులపై అనాగరికుడుగా అసహ్యంగా హాస్య నటుడు ఆలీ చేసే బుద్ధిహీన వ్యాఖ్యలకు ఇప్పటికే చలపతిరావుకు సమాజం విధించిన శిక్షతో పోల్చి లెఖ్కించి శిక్షిస్తే పదిసారలైనా మరణ శిక్ష విదించినా అది తక్కువే ఔతుంది.  


చలపతిరావు సుమారు తన 50 ఏళ్ల సినీ జీవితంలో అనేక సినిమాల్లో నటించి, సినిమా పరిశ్రమలో లో ఇప్పటికీ ఉన్న సీనియర్ నటుల్లో ఒకడిగా ఉంటూ వివాదాలకు తొలినుంచీ దూరంగానే ఉంటూ వచ్చారు. తాజాగా 'రారండోయ్ వేడుక చూద్దాం' ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ఏదో వినోదం కోసమనే తరహాలో మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన వ్యాఖ్యలు సమాజం లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై క్షమాపణలు చెప్పినప్పటికీ వేడి ఇంకా చల్లారటం లేదు.


తాజా వివాదంపై చలపతిరావు స్పందిస్తూ "డబ్భై మూడేళ్ల వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా నేనుచేసిన ఒక వ్యాఖ్య, దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న "ఆడవాళ్లతో హానికరమా?" దానికి జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు కాని...." ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్రహీనుడిగా మార్చేశారని" వాపోవటం ఆయనలోని పశ్చాతాపాన్ని తెలుపుతుంది. ఆవేదనా బయటపడుతుంది. 
అయితే వివాదం జరిగి ఐదు రోజులవుతున్నా ఈ సొద కంటిన్యూ అవుతూనే ఉంది. పలు మహిళాసంఘాలతో పాటు, సినిమా పరిశ్రమ పెద్దలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం హెచ్చరించిన నేపద్యంలో "ఆయన చేసిన తప్పుకు పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదాన్ని అంతకంతకూ ఎక్కువ చేస్తున్నారని ఇలా మానాన్నను పలుమార్లు మానసికంగా హింసించడం కంటే.. రాళ్లు తీసుకుని ఒకేసారి శారీరకంగా కొట్టి చంపేయండి" అన్టూ ఆయన కొడుకు ప్రముఖ దర్శకుడు,నటుడు రవిబాబు అవేదన వ్యక్తం చేశారు.


"మా నాన్నకు మద పిచ్చి ఎక్కువైపోయి ఆ కామెంట్స్ చేశారంటున్నారు. నిజమే మా చిన్నప్పుడే మా తల్లి చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ మమ్మల్ని ఎక్కడ సరిగా చూసు కోదేమో అని తన సుఖాలను త్యాగం చేశారు నా తండ్రి. ఆయన నోరు జారారు. అది ముమ్మాటికీ తప్పే. చేసిన తప్పుకు ఆయనకు ఇప్పటికే చాలా పెద్ద శిక్ష వేశారు. ఆయన ఎంత మనోవేదన పడుతున్నారో నాకు తెలుసు. ఇంతకంటే పెద్ద శిక్ష మరోటి లేదు" 


కాని కొంత మంది ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నారు. కారణం మానాన్న అతి సామాన్యుడు, గతంలో చాలా మంది పెద్దవాళ్లు ఆడవాళ్లపై ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు మా నాన్నపై విరుచుకుపడుతున్నాయి అని తన ఆవేదనను తెలియజేశారు రవిబాబు.  కనీసం ఆయన కొడుకుమాట వినైనా ఈ వివాదం ముగిస్తే మంచిదని అనేక మంది మగువలే కాదు సహనటీమణులే అంటున్న సంధర్భమిది.  


ఈ సందర్భంగా  మహిళా సంఘాలకు, సినిమా పరిశ్రమ పెద్దలకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సైతం ఒక సామాన్యుడు సవాల్ విసురుతున్నాడు. వయోవృద్ధుడు, పెద్ద విద్యావంతుడు (కాకపోవచ్చు) అపూర్వ లాంటి నటీమణులు ఆయనపై కితాబు ఇచ్చిన సందర్భంగా  "ముందుగా వీళ్ళు నందమూరి బాలకృష్ణపై, తరవాత అలీ మొదలైన వారిపై తగిన చర్య తీసుకుంటే ధమ్మున్న వాళ్ళవుతారు,  అంటే నిజంగా మదమెక్కింది బాల క్రిష్ణ అలీ గార్లకే అంటున్నారీ సామాన్యులు"  ముందు వారి పనిబట్టి  చలపతి రావు సంగతి చూస్తే మంచిదని ప్రజాభిప్రాయం..... మరిక కాచుకోండి.   

ఇంకేం మీలో పాపం చేయని వారే ముందుగ రాయి విసరాలి అని "నేరం నాదికాదు ఆకలిది" లోని సందేశాన్ని బాల కృష్ణ మరి అలీ పై అమలుచేసి ఆ తరవాత అదే చేతులతో చలపతిరావు పనిబట్టండి.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: