అకిరా భవిష్యత్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ఈరోజు ఈ టివి ప్రసారం చేస్తున్న రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిన్న ఈ టివి ఛానల్ కు ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.  అంతేకాదు తన కొడుకు అకిరా నందన్ పై ఆ సక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అకిరా నందన్ కు ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశం లేకపోయినా తాను అకిరాకు తెలుగు నేర్పించడమే కాకుండా తెలుగును బాగా చదివే విధంగా తీర్చిదిద్దుతున్నాను అన్న విషయం బయట పెట్టింది.  ప్రస్తుతం 12 సంవత్సరాలు వయసులో ఉన్న అకిరా భవిష్యత్ లో ఏమి అవుతాడో తనకు తెలియదు అని అంటూ అతడికి 16 సంవత్సరాలు వచ్చిన తరువాత ఏమి అవుతాడో తెలుసుకుని ఆ విధంగా తీర్చి దిద్ది ఎప్పటికైనా పవన్ కు అప్పచేపుతాను అన్న సంకేతాలు ఇచ్చింది రేణు దేశాయ్.

అంతేకాదు త్వరలో తాను తీయబోయే మరో కొత్త సినిమాలో పవన్ కూతురు ఆద్య కూడ నటిస్తుంది అన్న విషయాన్ని బయట పెట్టింది.  ప్రస్తుత తరం అమ్మాయిలు పెళ్ళి  గురించి ఆ తరువాత పెళ్ళి వల్ల ఏర్పడే రకరకాల సమస్యలను గురించి తలుచుకుని నేటి తరం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారు అన్న మూల కథతో తాను ‘ఇష్క్ వాల లవ్’ సినిమాను తీసినట్లు తన మనసులోని విషయాన్ని బయట పెట్టింది.

అయితే రేణు దేశాయ్ ఈ ఇంటర్వ్యూలో తరుచు పెళ్ళి గురించి అదేవిధంగా బ్రేకప్ గురించి  ఎక్కువ సార్లు మాట్లాడిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ నుండి ఆమె విడిపోయిన నేపధ్యాన్ని ఇంకా మర్చిపోలేకపోతోందా అని అనిపించడం సహజం.  ఈ సినిమా తెలుగులో విడుదల కాకపోయినా ఈ సినిమాను ఒక ప్రీమియర్ షోగా ఈటివి ప్రసారం చేయడమే కాకుండా రేణు దేశాయ్ తో ఒక స్పెషల్ ఇంతర్వ్యును ప్రసారం చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

అకిరా భవిష్యత్తులో తండ్రి దగ్గరికే వస్తాడన్న సంకేతాలు ఇవ్వడం  అకిరా భవిష్యత్ ఏమిటి అన్నది  పవన్ చేతుల్లోనే ఉందని ఆమె చెప్పడం బట్టి రేణు అకిరనందన్  పవన్ వారసుడిగా రానున్న రోజులలో మారబోతున్నాడు అన్నసంకేతాలు స్పష్టంగా ఇచ్చింది అనుకోవాలి .

ఇక  ఇదే ఇంటర్వ్యూ లో పవన్ ఫేస్ బుక్ లోకి వస్తే బాగుంటుంది కదా అన్నప్రశ్న పై  తన అభిప్రాయాలను వెల్లడిస్తూ  ‘‘పవన్ సోషల్ మీడియాలోకి రావాలని నేను రెండేళ్ల కిందటే సలహా ఇచ్చాను. కనీసం ట్విట్టర్లోకి అయినా వచ్చాడు సంతోషం’’ అని అనడం బట్టి రేణు ఇంకా పవన్ గురించి ఎంతగా ఆలోచిస్తోందో అర్ధం అవుతుంది.
టాలీవుడ్ లో  టాప్ హీరోల వారసుల  హంగామా విపరీతంగా జరుతున్న నేపధ్యంలో అకిరా నందన్ మొట్టమొదటిసారి ఈ రోజు బుల్లి తెరపై కొద్ది సేపు కనిపించ బోతున్న నేపధ్యం పవన్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: